నరాలు తెగే ఉత్కంఠతో అందరూ చూస్తుండగా ఓ మహిళ ప్రాణాలను RPF Constable కాపాడారు. 18 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఈ అధికారి 33 ఏళ్ల పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పనిచేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ అధికారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని లలిత్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు మహిళలు పట్టాల పై నుంచి ప్లాట్‌ఫామ్‌లు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో రెండో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వరిస్తున్న కమ్లేష్ కుమార్ దుబే వారిని వారించాడు. అయినా వారు వినకుండా ముందుకే కదలారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకువస్తోంది. అప్పటికే ఓ మహిళ ప్లాట్‌ఫామ్ పైకి ఎక్కేసింది. మరో మహిళ ఇంకా పట్టాలు దాటుతోంది.
ఆమె సురక్షితంగా ప్లాట్‌ఫామ్ ఎక్కుతుందా? లేదా? అనే అందరూ నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూశారు. అంతలో కమ్లేష్ ప్లాట్‌ఫామ్ చివరి వరకు వెళ్లి తన బలాన్ని అంతా ఉపయోగించి ఆ మహిళను చివరి నిమిషంలో పైకి లాగారు. కేవలం ఒక సెకెను వ్యవధిలో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కమ్లేష్పై నెటిజన్లు `సూపర్ మ్యాన్` అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి