టీ ఎంసెట్‌లో టాపర్‌ మనోడే!

ABN , First Publish Date - 2022-08-13T04:59:03+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌లో జిల్లా విద్యార్థి మెరిశాడు. పీసీపల్లి మండలం పెదఇర్లపాడుకు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి ప్రథమ ర్యాంక్‌ సాధించాడు. శుక్రవారం టీఎంసెట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. లోహిత్‌రెడ్డి 151.615 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఏపీఈఏపీ సెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోనూ లోహిత్‌రెడ్డి 2వ ర్యాంక్‌ సాధించాడు. ఈనెల 8వ తేదీన విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో 300 మార్కులకు 290 మార్కులు సాధించి ఆల్‌ ఇండియాలో 27వ ర్యాంక్‌తో మెరిశాడు.

టీ ఎంసెట్‌లో  టాపర్‌ మనోడే!
లోహిత్‌రెడ్డి

ప్రథమ ర్యాంకు సాధించిన

పెదఇర్లపాడు విద్యార్థి

ఈఏపీలోనూ రెండో ర్యాంక్‌తో

మెరిసిన లోహిత్‌రెడ్డి 

జేఈఈ మెయిన్స్‌లో 

27వ ర్యాంకుతో సత్తా

పీసీపల్లి, ఆగస్టు 12 : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌లో జిల్లా విద్యార్థి మెరిశాడు. పీసీపల్లి మండలం పెదఇర్లపాడుకు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి ప్రథమ ర్యాంక్‌ సాధించాడు. శుక్రవారం టీఎంసెట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. లోహిత్‌రెడ్డి 151.615 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఏపీఈఏపీ సెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోనూ లోహిత్‌రెడ్డి 2వ ర్యాంక్‌ సాధించాడు. ఈనెల 8వ తేదీన విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో 300 మార్కులకు 290 మార్కులు సాధించి ఆల్‌ ఇండియాలో 27వ ర్యాంక్‌తో మెరిశాడు.  లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి తల్లిదండ్రులు పోలు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంతం ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. దర్శి జడ్పీ ఉన్నత పాఠశాలలో మాల్యాద్రిరెడ్డి, తాళ్లూరు మండలం తూర్పుగంగవరంలో లక్ష్మీకాంతం ఎస్‌జీటీగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులుండగా లోహిత్‌రెడ్డి చిన్నవాడు. తెలంగాణ ఎంసెట్‌లో ప్రథమ ర్యాంక్‌ సాధించిన లోహిత్‌రెడ్డిని తల్లిదండ్రులు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంతం, గ్రామస్థులు అభినందించారు.  

Updated Date - 2022-08-13T04:59:03+05:30 IST