Air India New Menu: ఎయిరిండియాలో ఇక నోరూరించే మెనూ!

ABN , First Publish Date - 2022-10-04T01:18:50+05:30 IST

ఇకపై ఎయిరిండియా (Air India) విమానమెక్కే దేశీయ ప్రయాణికులకు నోరూరిపోతుందంతే! తమ సొంతమైన ఎయిరిండియా(Air India)

Air India New Menu: ఎయిరిండియాలో ఇక నోరూరించే మెనూ!

న్యూఢిల్లీ: ఇకపై ఎయిరిండియా (Air India) విమానమెక్కే దేశీయ ప్రయాణికులకు నోరూరిపోతుందంతే! తమ సొంతమైన ఎయిరిండియా(Air India)కు పునర్వైభవం తెచ్చేందుకు టాటాలు సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. అందులో భాగంగా నూతన మెనూ (Menu)ను ప్రవేశపెట్టారు. పండుగ సీజన్ సందర్భంగా ఈ నూతన మెనూ (menu)ను ప్రవేశపెట్టినట్టు టాటా తెలిపింది. అయితే, ఇది దేశీయ విమాన ప్రయాణికులు మాత్రమే. ఖరీదైన, రుచికరమైన ఆహారంతోపాటు భోజనానికి ముందు ఇచ్చే అపిటైజర్లు, భోజనం తర్వాత ఇచ్చే నాణ్యమైన డెజర్ట్స్‌ను కొత్త మెనూలో చేర్చింది. అక్టోబరు 1 నుంచే ఈ మెనూ (Menu) అమల్లోకి వచ్చింది. ప్రయాణికుల ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తూ ఈ రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించేలా కొత్త మెనూ (menu)ను ఏర్పాటు చేసినట్టు సంస్థ పేర్కొంది. దేశీయ రూట్లలో ఈ మెనూ (menu)ని విడుదల చేసినందుకు సంతోషంగా ఉన్నట్టు ఎయిరిండియా (air india) ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ హెడ్ సందీప్ వర్మ తెలిపారు. త్వరలోనే దీనిని అంతర్జాతీయ విమానాలకూ విస్తారిస్తామన్నారు.


 ‘విహాన్.ఏఐ’ పేరుతో ఎయిరిండియా గత నెల దీర్ఘకాలిక ప్రణాళికను విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశీయ మార్కెట్‌లో 30 శాతం వాటాను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లోనూ బలపడాలన్నదే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. కాగా, టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తారా (Vistara) తమ డ్రీమ్‌ లైనర్ విమానాల్లో అక్టోబరు 1 నుంచి టెలివిజన్ చానళ్లను లైవ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 



Updated Date - 2022-10-04T01:18:50+05:30 IST