చిన్న నీళ్ల బిందెతో ఆడుకుంటూనే తలపై బోర్లించుకున్న రెండేళ్ల పాప.. ఇరుక్కుపోయి విలవిల.. చివరకు..

ABN , First Publish Date - 2021-12-23T20:49:18+05:30 IST

చిన్న పిల్లలు తమకు దొరికిన ప్రతి వస్తువుతో ఆటలాడుతుంటారు.

చిన్న నీళ్ల బిందెతో ఆడుకుంటూనే తలపై బోర్లించుకున్న రెండేళ్ల పాప.. ఇరుక్కుపోయి విలవిల.. చివరకు..

చిన్న పిల్లలు తమకు దొరికిన ప్రతి వస్తువుతో ఆటలాడుతుంటారు. వాటి వెనుక ఉండే ప్రమాదాల గురించి వారికి అవగాహన ఉండదు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో 2 ఏళ్ల చిన్నారి బిందెతో ఆడుతూ దానిని తలపై బోర్లించుకుంది. ఆ బిందెలో బాలిక తల ఇరుక్కుపోయింది. దాంతో ఆ చిన్నారి ఊపిరాడక విలవిలలాడింది. ఎంత మంది ప్రయత్నించినా ఆ బిందె బయటకు రాలేదు.  


ఛత్తీస్‌గఢ్‌లోని నవాగావ్ గ్రామానికి చెందిన సోనూ యాదవ్ అనే బాలిక బుధవారం ఉదయం తన తల్లి లిసికా యాదవ్‌తో కలిసి నీళ్లు తెచ్చేందుకు సమీప బోరు పంపు వద్దకు వెళ్లింది. తల్లి ఒక బిందెలోకి నీరు తోడుతుండగా.. సోనూ మరో బిందెతో ఆడుకోవడం ప్రారంభించింది. ఆ క్రమంలో ఆ బిందెను తన తలపై బోర్లించుకోవడంతో దానిలో తల ఇరుక్కోపోయింది. సోనూ ఒక్కసారిగా ఏడవడంతో అందరూ ఆ పాప వైపు చూశారు. ఎంత ప్రయత్నించినా ఆ బిందె బయటకు రాలేదు. లోపల ఊపిరాడక సోనూ విలవిలలాడింది. దీంతో సోనూను వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ సురక్షితంగా సోనూ తలను బిందె నుంచి బయటకు తీశారు. 

Updated Date - 2021-12-23T20:49:18+05:30 IST