గాంధీ విగ్రహమే టార్గెట్.. మొన్న Americaలో.. నేడు Canadaలో..

ABN , First Publish Date - 2022-07-14T22:44:54+05:30 IST

కెనడాలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని టార్గెట్ చేశారు. టొరెంటోలోని యోంగే స్ట్రీట్‌లో గల విష్ణు దేవాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసుల నివేదికను ఉటంకిస్తూ స్థానిక

గాంధీ విగ్రహమే టార్గెట్.. మొన్న Americaలో.. నేడు Canadaలో..

ఎన్నారై డెస్క్: కెనడాలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని టార్గెట్ చేశారు. టొరెంటోలోని యోంగే స్ట్రీట్‌లో గల విష్ణు దేవాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసుల నివేదికను ఉటంకిస్తూ స్థానిక మీడియా వార్తలను ప్రసారం చేసింది. దీంతో టొరెంటోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ స్పందించింది. ఈ దాడిని ఖండిస్తూ.. కెనడాలోని భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి.. దుండగులకు తగిన శిక్ష విధించాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఘటనపై కెనడాలోని ఇండియన్ హైకమిషన్ కూడా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన ద్వారా ఇక్కడి భారతీయుల్లో ఆందోళన, అభద్రతాభావం పెంపొందుతుందని వెల్లడించింది. 



అమెరికాలో కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. న్యూయార్క్‌లో ఉన్న 8 అడుగుల మ‌హాత్మ గాంధీ కాంస్య విగ్ర‌హాన్ని కొందరు దుండులు ధ్వంసం చేశారు. అప్పట్లో ఈ ఘటనను అక్కడి కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి.. స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జరిపి, విగ్రహాన్ని విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరింది. 


Updated Date - 2022-07-14T22:44:54+05:30 IST