Chhattisgarh గ్రామంలో ముస్లింలను బహిష్కరిస్తామని ప్రజల ప్రతిజ్ఞ

ABN , First Publish Date - 2022-01-08T12:59:58+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ముస్లింలను బహిష్కరిస్తామని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది...

Chhattisgarh గ్రామంలో ముస్లింలను బహిష్కరిస్తామని ప్రజల ప్రతిజ్ఞ

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ముస్లింలను బహిష్కరిస్తామని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ వీడియో తీసిన వ్యక్తిని కనిపెట్టామని, ఈ వ్యవహారంతో ఏ రాజకీయ పార్టీ లేదా మత సంస్థ ప్రమేయం కనిపించలేదని పోలీసులు తెలిపారు.‘‘ హిందువులమైన మేం ఏ ముస్లిం దుకాణదారుని నుంచి వస్తువులను కొనుగోలు చేయం, మా భూమిని ఏ ముస్లింకు అమ్మం లేదా అద్దెకు ఇవ్వం’’ అని సర్గుజా జిల్లాలోని కుండికల గ్రామ నివాసితులు చెబుతున్న వీడియోలో ఉంది.‘‘మేం హిందువులం, మా గ్రామాలకు వచ్చే విక్రేతల నుంచి వారి మతాన్ని నిర్ధారించిన తర్వాత మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ముస్లింల వద్ద కూలీలుగా పని చేయబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం’’ అని వారు వీడియోలో పేర్కొన్నారు. 


జనవరి 1వతేదీన కుండికల, ఆరా అనే రెండు గ్రామాల నివాసితుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత ఈ వీడియో బయటపడిందని అధికారులు తెలిపారు.కొత్త సంవత్సరం రోజున ఆరా గ్రామానికి చెందిన కొంతమంది అబ్బాయిలు విహారయాత్ర కోసం కుండికాల వద్దకు వచ్చి స్థానిక పురుషులతో గొడవ పడ్డారు.సాయంత్రం తరువాత ఆరా గ్రామం నుంచి 10 మందికి పైగా వ్యక్తులు స్థానిక ప్రజాప్రతినిధి ఇలియాస్ నేతృత్వంలో మోటార్ సైకిళ్లు, కార్లలో వచ్చి స్థానిక బీరేంద్ర యాదవ్ ఇంట్లోకి ప్రవేశించి అతని కుటుంబంపై దాడి చేశారు.ఈ ఘటనలో బీరేంద్ర యాదవ్ మైనర్ మేనకోడలు సహా ఇంట్లో ఉన్నవారందరికీ గాయాలయ్యాయి.ఈ వైరల్ వీడియోపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2022-01-08T12:59:58+05:30 IST