Bal Thackerays పాదాల చెంత cm Eknath Shinde...ట్విట్టర్ హ్యాండిల్‌గా కొత్త ఫొటో

ABN , First Publish Date - 2022-07-01T13:50:14+05:30 IST

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నాయకుడు ఏకనాథ్ షిండే రెండో రోజే తన ట్విట్టర్ హ్యాండిల్‌లో...

Bal Thackerays పాదాల చెంత cm Eknath Shinde...ట్విట్టర్ హ్యాండిల్‌గా కొత్త ఫొటో

ముంబయి(మహారాష్ట్ర): మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నాయకుడు ఏకనాథ్ షిండే రెండో రోజే తన ట్విట్టర్ హ్యాండిల్‌లో శివసేన వ్యవస్థాపకుడు స్వర్గీయ బాలథాకరేతో కలిసి ఉన్న ఫొటోను పెట్టారు. బాలథాకరేకు తానే అసలైన రాజకీయ వారసుడినని చెప్పేందుకు వీలుగా ఆయన పాదాల చెంత కూర్చున్న తన ఫొటోను ట్విట్టరులో పోస్టు చేశారు.శివసేనకు చెందిన ఉద్ధవ్ థాకరే నాయకత్వంపై 9రోజుల తిరుగుబాటు తర్వాత గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఏక్‌నాథ్ షిండే, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేకు అసలు రాజకీయ వారసుడిని తానే అంటూ ఒక సందేశాన్ని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంపారు.సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన వెంటనే షిండే తన ట్విట్టర్ హ్యాండిల్ యొక్క ప్రొఫైల్ చిత్రాన్ని బాలాసాహెబ్ థాకరేతో ఉన్న ఫొటోతో మార్చారు.


 బాలథాకరే మండుతున్న హిందుత్వ చిహ్నం, మరాఠా స్వాభిమానం (Maratha pride) యొక్క చిహ్నం అని షిండే పేర్కొన్నారు.బీజేపీ మద్దతుతో శివసేన రెబల్స్ మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకోగలిగినప్పటికీ, అసలు పార్టీని నియంత్రించే పోరు రెండు వర్గాల మధ్య సాగుతోంది.అసలైన శివసేన తామేనని షిండే వర్గం సుప్రీంకోర్టులో ప్రకటించింది. శరద్ పవార్ యొక్క నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్‌తో సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బాల్ థాకరే యొక్క హిందుత్వ భావజాలాన్ని ఉద్ధవ్ థాకరే పలుచన చేశారని, దానిని అసహజ కూటమిగా షిండే పేర్కొన్నారు.సీఎం షిండేకు 39 మంది (55 మందిలో) శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉంది.ఉద్ధవ్ థాకరే బృందంలో 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 


షిండే ద్రోహం చేశారంటూ ఆయన్ని లక్ష్యంగా చేసుకుని శివసైనికులు వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ పార్టీ ఆటో రిక్షా డ్రైవర్లను హ్యాండ్‌కార్ట్ పుల్లర్‌లను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసిందని శివసైనికులు చెప్పారు. సీఎం షిండే గతంలో థానేలో ఆటో రిక్షా డ్రైవర్ కావడంతో శివసైనికులు ఈ వ్యాఖ్యలు చేశారు.


Updated Date - 2022-07-01T13:50:14+05:30 IST