వృద్ధులపై జరిమానాలు విధించేందుకు సిద్ధమైన గ్రీస్.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-01-17T23:21:40+05:30 IST

కరోనా టీకాను వేయించుకోని 60 ఏళ్ల పైబడిన వృద్ధులపై జరిమానాలు విధించేందుకు గ్రీస్ ప్రభుత్వం సిద్ధమైంది.

వృద్ధులపై జరిమానాలు విధించేందుకు సిద్ధమైన గ్రీస్.. కారణం ఇదే..

ఇంటర్నెట్ డెస్క్:  కరోనా టీకాను వేయించుకోని 60 ఏళ్ల పైబడిన వృద్ధులపై జరిమానాలు విధించేందుకు గ్రీస్ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం నుంచీ అక్కడి అధికారులు సీనియర్ సిటిజన్లపై ఫైన్లు విధించడం ప్రారంభించారు. జనాభాలో టీకాలు తీసుకున్న వారి శాతం పెంచడం ద్వారా ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ఈ విధానానికి తెరలేపింది. జరిమానాలు తప్పించుకోవాలంటే టీకా వేయించుకోవడమే అత్యంత సులువైన మార్గం అని ప్రధాని కిరియాకోస్ మిస్టోకాసిస్ అక్కడి సీనియర్ సిటిజన్లకు తేల్చి చెప్పారు. ‘‘అసలు జరిమానాలు ఇక్కడ పెద్ద విషయమే కాదు.. టీకాలు వేయించుకుని మీరు ప్రాణాలను రక్షించుకోండి.. మీ బంధువులు స్నేహితులను కాపాడుకోండి’’ అంటూ ఆయన సోమవారం వృద్ధులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2022-01-17T23:21:40+05:30 IST