Haryana woman shocking decision: కలిసిపోయిందిలే అనుకున్న కోడలు.. చివరకు ఎంత పని చేసింది.. చెత్త వేసి రమ్మని అత్తకు చెప్పి..

ABN , First Publish Date - 2022-07-29T03:01:22+05:30 IST

కొత్తగా వచ్చిన కోడళ్లకు ఎక్కువగా భర్త, అత్తమామల నుంచి సమస్యలు ఎదురవుతుంటాయి. అదనపు కట్నం పేరుతో కొందరు, వివాహేతర సంబంధాల విషయంలో మరికొందరు..

Haryana woman shocking decision: కలిసిపోయిందిలే అనుకున్న కోడలు.. చివరకు ఎంత పని చేసింది.. చెత్త వేసి రమ్మని అత్తకు చెప్పి..
ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా వచ్చిన కోడళ్లకు ఎక్కువగా భర్త, అత్తమామల నుంచి సమస్యలు ఎదురవుతుంటాయి. అదనపు కట్నం పేరుతో కొందరు, వివాహేతర సంబంధాల విషయంలో మరికొందరు చిత్రహింసలకు గురిచేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. కొత్తగా వచ్చిన కోడలు అందరితో సరదాగా గడిపేది. కలిసిపోయిందిలే అనుకున్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చెత్త వేసి రమ్మని అత్తకు చెప్పి.. ఆమె చేసిన పని సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..


హర్యానా (Haryana) రాష్ట్రం అంబాలా పట్టణంలోని న్యూ శివాలిక్ కాలనీకి చెందిన యువకుడికి.. కమెహదీ జిల్లా యమునానగర్ గ్రామానికి చెందిన యువతి (young woman) తో 2021 నవంబర్‌లో వివాహమైంది. అప్పటి నుంచి యువకుడు భార్యతో పాటూ తల్లిదండ్రులతో వద్ద ఉంటున్నాడు. మొన్నటిదాకా ఆమె అందరితో కలివిడిగా ఉంటూ సంతోషంగా ఉండేది. కోడలు అందరితో బాగా కలిసిపోతోందని అత్తమామలు కూడా సంబరపడ్డారు. అయితే ఇటీవల సొంతూరుకు వెళ్లేందుకు పదే పదే సాకులు చెబుతూ ఉండేది. తల్లిదండ్రుల (parents) ను చూడాలనే ఉద్దేశంతో అలా చెబుతోందని అంతా అనుకున్నారు. జూలై 23న భర్త పుట్టిన రోజు (birthday) కావడంతో ఘనంగా నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అదే రోజు కోడలు అనూహ్య నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు.

Wife Tortured Husband: స్టేషన్‌కు వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడు చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఏడాది క్రితమే రెండో పెళ్లయిందంటూ..


ఆ రోజు భర్త పని మీద బయటికి వెళ్లాడు. ఇంట్లో అత్త ఒక్కటే ఉండడంతో ఇదే సరైన సమయం అని అనుకుంది. చెత్త తీసుకెళ్లి బయట పడేయమని అత్తకు చెప్పింది. ఆమె తిరిగి ఇంటికి వచ్చి చూస్తే లోపల కనిపించలేదు. ఊర్లో అందరిన విచారించినా ఫలితం లేదు. సమాచారం అందుకున్న భర్త.. కంగారుగా ఇంటికి వచ్చి పరిశీలించాడు. ఇంట్లో రూ.7వేల నగదు, ఆధార్ కార్డు (Aadhaar card) , వివాహ ధృవీకరణ పత్రం (Marriage certificate) , మొబైల్‌ (Mobile) కనిపించలేదు. చివరకు ఆమె సొంతూరులో విచారించినా రాలేదని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు (Missing case) నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రభుత్వ ఉద్యోగాన్ని వద్దనుకున్నాడు.. ఇప్పుడు అతడికి ప్రతీ రోజూ రూ.2.40 లక్షలు.. అమెరికా, జపాన్ నుంచి కూడా ఆర్డర్లు..!



Updated Date - 2022-07-29T03:01:22+05:30 IST