మాట్లాడుతున్న తోట సీతారామలక్ష్మి
పింఛన్‌కు అర్హత 50 ఏళ్లకు పెంచడం దారుణం: తోట
భీమవరం అర్బన్, జూన్ 24: వైసీపీ ప్రభుత్వం ఒంటరి మహిళలకు అన్యాయం చేస్తోందని, పింఛన్‌కు అర్హత వయసును 35 నుంచి 50 ఏళ్లకు పెంచడం దారుణమని టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు, పార్టీ భీమవరం నియోజవర్గ ఇన్‌చార్జి తోట సీతారామలక్ష్మి విమర్శించారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి అధ్యక్షతన నియోజకవర్గ మహిళా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. నవరత్నాల పేరుతో చంద్రన్న పెళ్లికానుక, చంద్రన్న బీమా, ఒంటరి మహిళల సంక్షేమ పథకాలను తొలగించి మహిళలకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని తోట సీతారామలక్ష్మి విమర్శించారు. ఒంటరి మహిళల పింఛన్ వయస్సును పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో అనేక మంది నష్టపోతున్నారని, వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని శిరిగినీడి రాజ్యలక్ష్మి డిమాండ్ చేశారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ మెరగాని నారాయణమ్మ, తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, ఎండీ షబీనా, ఎస్‌డీ నసీమాబేగం, కన్నెగంటి రుత్ కళ, తిరుమాని శశిదేవి, రొంగల కృష్ణవేణి జిల్లా, ఉప్పలపాటి లక్ష్మి, బొడ్డు రేవతి పాల్గొన్నారు.