పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరమ్మాయిలు.. ఏమైందని అడిగితే వాళ్లు చెప్పింది విని అవాక్కైన పోలీసులు.. చివరకు..

ABN , First Publish Date - 2022-05-06T21:11:40+05:30 IST

ఆ ఇద్దరు అమ్మాయిలు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరినొకరు కలిశారు.. అతి తక్కువ కాలంలోనే ఇద్దరూ స్నేహితులయ్యారు..

పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరమ్మాయిలు.. ఏమైందని అడిగితే వాళ్లు చెప్పింది విని అవాక్కైన పోలీసులు.. చివరకు..

ఆ ఇద్దరు అమ్మాయిలు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరినొకరు కలిశారు.. అతి తక్కువ కాలంలోనే ఇద్దరూ స్నేహితులయ్యారు.. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేవారు.. ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు.. సామాజిక బంధనాలను తెంచుకుని పెళ్లికి సిద్ధమయ్యారు.. కుటుంబ సభ్యులు వారి ఇష్టాన్ని పట్టించుకోలేదు.. ఇద్దరినీ విడదీసేందుకు ప్రయత్నించారు.. దీంతో వారు ఇళ్ల నుంచి పారిపోయారు.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ ప్రేమకథ చెప్పారు. 


బీహార్‌లోని పాట్నాకు చెందిన తనిష్క్ శ్రీ అనే యువతికి కొద్ది నెలల కిందట శ్రేయా ఘోష్ అనే అమ్మాయి పరిచయమైంది. ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్లికి కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. తమ పరువు పోతుందని వారిని విడదీసేందుకు ప్రయత్నించారు. దీంతో నాలుగు రోజుల కిందట అమ్మాయిలిద్దరూ అదృశ్యమయ్యారు. దీంతో తనిష్క్ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


పోలీస్ కేసు విషయం తెలుసుకుని ఇద్దరూ గురువారం పాట్నాకు చేరుకున్నారు. మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ ప్రేమ, పెళ్లి గురించి చెప్పి రక్షణ కావాలని అడిగారు. అయితే అక్కడ వారికి సహాయం అందలేదు. దీంతో వారు జిల్లా ఎస్పీని కలిసి తమ సమస్య వివరించారు. ఇద్దరి వయసు 18 ఏళ్లు దాటిందని, చట్ట ప్రకారం కలిసి జీవించే హక్కు మాకుందని తెలిపారు. వారి నుంచి ఫిర్యాదు తీసుకున్న జిల్లా ఎస్పీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Read more