కమిషనర్‌పై దాడికి నిరసనగా.. రోడ్డెక్కిన మున్సిపల్‌, సచివాలయ ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-06-25T05:18:38+05:30 IST

రాయచోటి మున్సి పల్‌ కమిషనర్‌పై వైసీపీ నాయకుల దాడికి నిరసనగా శుక్రవారం వందలాది మంది ఉద్యోగులు శుక్రవారం రో డ్డెక్కారు. రాయచోటి మున్సిపల్‌ కార్యాలయం నుంచి సు మారు 4 కి.మీ. దూరంలోని కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి త మ నిరసనను తెలిపారు. కమిషనర్‌పై దాడి చేసిన వారి ని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. కలెక్టరేట్‌ ఎదుట సుమారు అరగంట పాటు నినాదాలు ఇస్తూ.. ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్‌ ఉద్యోగులను తన ఛాంబర్‌లోకి పిలిపించి మాట్లాడారు.

కమిషనర్‌పై దాడికి నిరసనగా.. రోడ్డెక్కిన మున్సిపల్‌, సచివాలయ ఉద్యోగులు
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఉద్యోగులు

4 కి.మీ. మేర ర్యాలీ

జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల నిరసన

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

దాడిని ఖండించిన ఎమ్మెల్యే

దాడే జరగలేదని మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్ల ఖండన

రాయచోటి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాయచోటి మున్సి పల్‌ కమిషనర్‌పై వైసీపీ నాయకుల దాడికి నిరసనగా శుక్రవారం వందలాది మంది ఉద్యోగులు శుక్రవారం రో డ్డెక్కారు. రాయచోటి మున్సిపల్‌ కార్యాలయం నుంచి సు మారు 4 కి.మీ. దూరంలోని కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి త మ నిరసనను తెలిపారు. కమిషనర్‌పై దాడి చేసిన వారి ని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. కలెక్టరేట్‌ ఎదుట సుమారు అరగంట పాటు నినాదాలు ఇస్తూ.. ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్‌ ఉద్యోగులను తన ఛాంబర్‌లోకి పిలిపించి మాట్లాడారు. ఉద్యోగులతో సు మారు గంటపాటు కలెక్టర్‌ మాట్లాడి దాడి జరిగిన విధా నాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిప ల్‌ మేనేజర్‌ సాల్మన్‌రాజు మాట్లాడుతూ.. ఈ దాడిని తేలికగా తీసుకోవద్దని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు. సాక్షాత్తూ.. కార్యాలయంలోకి వచ్చి.. కమిషనర్‌ పైనే దాడి చేస్తే.. కింది స్థాయి సిబ్బంది ఏ విధంగా ధైర్యంతో పని చేయగలరని పేర్కొన్నారు. ఇకపైన ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్య లు తీసుకుంటామన్నారు. అక్రమ లే అవుట్లు ఆపినందు కు ఇలా జరిగిందని సచివాలయ సిబ్బంది కలెక్టర్‌ ముం దు వాపోయారు. గతంలో కూడా సచివాలయ సిబ్బంది పై దాడులు జరిగినా.. సరైన చర్యలు తీసుకోలేదని  సచి వాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయా లపై కలెక్టర్‌ మాట్లాడుతూ. విధి నిర్వహణలో ఉన్న కమి షనర్‌పై దాడి చేయడం చాలా బాధకరమన్నారు. ఈ విషయమై చట్ట ప్రకారం.. ఏ రకమైన చర్యలు తీసుకోవా లో.. అన్ని తీసుకుంటామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు 2019కి పూర్వం ఉన్న లే అవుట్లకు 30 అడుగుల రోడ్లు, వెంచర్‌లో 10 శాతం పార్కులకు స్థలం ఉన్న వాటికి రిజిస్ర్టేషన్‌ చేయాలని సూచించినట్లు తెలిపారు. అంతకు ముందు కమిషనర్‌తో కలెక్టర్‌ మాట్లాడి.. దాడికి సంబం ధించిన అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. వెం టనే ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి.. దాడికి పాల్పడిన వ్యక్తు లు ఎవరైనా.. ఎంత మంది ఉన్నా.. వదలొద్దని ఆదేశిం చారు. కలెక్టర్‌ను కలిసిన  అనంతరం ఉద్యోగులందరూ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ  కమల్‌రాజను కలిసి దాడిపై వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ము న్సిపాల్టీకి చెందిన అన్ని విభాగాల ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. 


జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల నిరసన

మున్సిపల్‌ కమిషనర్‌పై జరిగిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌ ఉద్యోగులు, సిబ్బంది తమ నిరస నను తెలిపారు. మదనపల్లె, రాజంపేటలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మున్సి పల్‌ కమిషనర్‌ కార్యాలయంలోకే వచ్చి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ దాడి చేయడం హేయమైన చర్యని ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలు మున్సిపాలిటీల్లో నిరస న కార్యక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మున్సిపల్‌ కమిషనర్‌పై జరిగిన దాడిని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తులపై దాడి సమర్థనీయం కాదని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే వైసీ పీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌,  మదనమోహ న్‌రెడ్డి, నరసింహారెడ్డి, సాదిక్‌అలీతో పాటు పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ప్రకటనకు విరుద్ధంగా స్పందించారు. అసలు దాడే జరగలేదని, ఎందుకు అప్రూవల్‌ చేయరని అడిగినందుకు దాడి చేసినట్లు తప్పుడు ఫిర్యాదు చేశారని, కమిషనర్‌ వెనుక టీడీపీ నాయకులు ఉన్నారని వారు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 


జిల్లా రిజిస్ర్టార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు

గత రెండు రోజుల కిందట కొందరు జిల్లా రిజిస్ర్టార్‌, రాయచోటి సబ్‌ రిజిస్ట్రార్‌ను బెదిరించినట్లు తెలిసింది. తాము చెప్పినట్లు ఎందుకు రిజిస్టర్లు చేయరని, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. ఎందుకు చేయరని బెదిరించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎక్కడా లేనట్లు.. రాయచోటిలోనే.. రిజిస్ర్టేషన్లు ఎందుకు చేయడం లేదని గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోకి వచ్చిన కొందరు.. ఎమ్మెల్యే చెప్పినా.. మీరు తమ పనులు చేయకపోతే.. ఇక్కడ ఉండేది ఎందుకని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై రిజిస్ర్టేషన్‌ శాఖ అధికారులు, సిబ్బంది హడలిపోతున్నారు. ఈ ఒత్తిళ్లు ఎందుకు..? సెలవులో వెళ్లిపోతే సరిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2022-06-25T05:18:38+05:30 IST