అమ్మతనం అక్షరాలలో...

ABN , First Publish Date - 2021-01-06T05:30:00+05:30 IST

బాలీవుడ్‌ మాజీ నటి సొనాలీ బింద్రే తన మాతృత్వపు అనుభవాలను ‘ద మోడర్న్‌ గురుకుల్‌, మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ పేరెంటింగ్‌’ పుస్తకంలో పంచుకున్నారు.

అమ్మతనం అక్షరాలలో...

  • తల్లి అవడం ప్రతి మహిళ జీవితంలో మరపురాని
  •  క్షణం. సెలబ్రిటీలు కూడా సాధారణ మహిళల్లాగే మాతృత్వాన్ని ఎంతో ఆస్వాదిస్తారు. 
  • అంతేనా కొందరు సెలబ్రిటీలు అమ్మతనాన్ని, తమ 
  • పసికందుతో గడిపిన మధుర క్షణాలను 
  • పుస్తకాలుగా తీసుకొచ్చారు. అందులో తల్లిగా 
  • తమ అనుభూతులతో పాటు ఈమధ్యే తల్లి 
  • అయిన వారు పాటించాల్సిన  జాగ్రత్తలు, పిల్లల 
  • పెంపకం గురించిన పలు ఆసక్తికర విషయాలు 
  • పంచుకున్నారు. ఇంతకీ వారెవరంటే... 


 బాలీవుడ్‌ మాజీ నటి సొనాలీ బింద్రే తన మాతృత్వపు అనుభవాలను ‘ద మోడర్న్‌ గురుకుల్‌, మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ పేరెంటింగ్‌’ పుస్తకంలో పంచుకున్నారు. ఈ డిజిటల్‌ యుగంలో పిల్లలను ఎలా పెంచాలో ఈ పుస్తకంలో రాసుకొచ్చారామె.


 రెండో సారి తల్లి కాబోతున్న కరీనా కపూర్‌ కూడా తన అమ్మతనం జ్ఞాపకాలను, ఒక తల్లిగా తన అనుభవాలను ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ పుస్తకంగా అక్షర రూపమిచ్చే ఆలోచనలో ఉన్నారు. 


 ఇద్దరు కూతుళ్ల తల్లి ఇషా డియోల్‌ ‘అమ్మ మియా’ పుస్తకంలో తల్లిగా తన అనుభవాలు, కాబోయే తల్లులకు, తల్లి అయిన వారికి ఉపయోగపడే సలహాలు, వారు మెచ్చే వంటకాలను వివరించారు.

Updated Date - 2021-01-06T05:30:00+05:30 IST