సమతామూర్తి దేవాలయంలో బొద్దికూరపాడు విద్యార్థినుల భరతనాట్యం

ABN , First Publish Date - 2022-08-10T03:44:59+05:30 IST

మండలంలోని బొద్దికూరపాడు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యా ర్థినులు సోమవారం రాత్రి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల ఆశ్రమంలోని సమతామూర్తి (శ్రీ రా మానుజాచార్యుల)దేవాలయంలో భరతనాట్య ప్రద ర్శన ఇచ్చారు.

సమతామూర్తి దేవాలయంలో   బొద్దికూరపాడు విద్యార్థినుల భరతనాట్యం
బాలికలను ఆశీర్వదిస్తున్న స్వామీజీ

సమతామూర్తి దేవాలయంలో 

బొద్దికూరపాడు విద్యార్థినుల భరతనాట్యం

తాళ్లూరు, ఆగస్టు 9: మండలంలోని బొద్దికూరపాడు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యా ర్థినులు సోమవారం రాత్రి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల ఆశ్రమంలోని సమతామూర్తి (శ్రీ రా మానుజాచార్యుల)దేవాలయంలో భరతనాట్య ప్రద ర్శన ఇచ్చారు. చిన్నారుల నాట్యపదర్శనను  చిన్నజీయర్‌ స్వామి, అహోబిలం జీయర్‌ స్వామి తిలకించి ఆశీర్వదించారు. శ్రీరామానుజాచార్యుల విశిష్టతను విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో ప్ర ముఖ నట్యాచార్యులు మామిడి శివశంకర్‌, గంటసాలపవన్‌ కుమార్‌, గ్రామానికి చెందిన పోలంరెడ్డి  సుబ్బారెడ్డి, కోటేశ్వరరెడ్డి, పద్మావతి, లక్ష్మి, రమాదేవి, దుర్గ, కల్యాణి, మల్లేశ్వరి, రమణమ్మ, నాగిరెడ్డి, భాస్కర్‌, 14 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-10T03:44:59+05:30 IST