భర్త తాంత్రికుడు కావడంతో తలుపులు వేసి.. పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.. అయితే ఉన్నట్టుండి యువతి గొంతు వినిపించడంతో..

Published: Wed, 17 Aug 2022 18:39:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భర్త తాంత్రికుడు కావడంతో తలుపులు వేసి.. పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.. అయితే ఉన్నట్టుండి యువతి గొంతు వినిపించడంతో..

ఆమె భర్త ఓ తాంత్రికుడు. వివిధ రకాల సమస్యలతో అతడి వద్దకు రోజూ చాలా మంది వస్తుంటారు. వారితో డబ్బులు తీసుకుని, ఏవేవో పూజలు చేస్తూ పంపిస్తుంటాడు. ఆదాయం వస్తుండడంతో అతడి భార్య కూడా అడ్డుచెప్పలేదు. అయితే ఓ రోజు భార్య ఇంటికి వచ్చేసరికి.. భర్త గది తలుపులు వేసుకున్నాడు. దీంతో లోపల పూజలు చేస్తున్నాడేమో అని భార్య అనుకుంది. అయితే కాసేపటికి లోపలి నుంచి యువతి గొంతు వినిపించడంతో అనుమానం వచ్చింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని, తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రాష్ట్రం షాజాపూర్ జిల్లా (Shahjapur district ) బరోడియా ప్రాంతానికి చెందిన  జితేంద్ర అనే వ్యక్తి భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. జితేంద్ర స్థానికంగా తాంత్రిక పూజలు చేస్తుంటాడు. ఈ విషయం ఆనోటా, ఈనోటా పడి చుట్టు పక్కల ప్రాంతాల్లో అందరికీ తెలిసింది. దీంతో చాలా మంది బాధితులు.. వివిధ సమస్యలతో అతడి వద్దకు వస్తుంటారు. వారితో కొంత డబ్బులు తీసుకుంటూ, పూజలు చేసి పంపిస్తుంటాడు. అలాగే పలు గ్రామాలకు వెళ్లి.. భగవత్ కథలు కూడా చెప్తుంటాడు. ఈ క్రమంలో అతడికి చాలా మంది యువతులు (young women) , మహిళలతో కూడా పరిచయం ఏర్పడింది.

ఇంట్లోనే శవాన్ని పూడ్చేశాడు.. ఫోన్‌ను కంటైనర్‌పై పడేశాడు.. అన్నీ దృశ్యం సినిమాలో చూపించినట్టే చేశాడు కానీ..

ఇటీవల గుణ జిల్లాకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం... చివరకు ప్రేమగా మారింది. భార్యకు తెలీకుండా ఆమెతో కలుస్తూ ఉండేవాడు. ఇటీవల ఓ రోజు భార్య పని మీద బయటికి వెళ్లడంతో.. ప్రియురాలిని ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు. గది తలుపులు మూసేసి, లోపల పూజలు చేస్తున్నట్లు నటిస్తూ.. ప్రియురాలితో రాసలీలలు మొదలెట్టాడు. ఇంటికి వచ్చిన భార్యకు గది తలుపులు మూసి ఉండడంతో... లోపల భర్త పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.

husband ఇంట్లో లేడని తెలుసుకుని లోపలికి వెళ్లిన యువకుడు.. చివరకు అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం రావడంతో..

అయితే కాసేపటికి లోపలి నుంచి యువతి గొంతు వినిపించడంతో అనుమానం వచ్చింది. ఎంత పిలిచినా భర్త తలుపులు తీయకపోవడంతో పోలీసులకు ఫోన్ చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. లోపల ప్రియురాలితో ఉన్న భర్తను చూసిన భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. అందరిముందే భర్త ప్రియురాలిని కొట్టుకుంటూ బయటికి ఈడ్చుకొచ్చింది. దీంతో పోలీసులు కలుగజేసుకుని తాంత్రికుడు, అతడి ప్రియురాలిని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇన్నాళ్లూ.. తమ కూతురు కాలుజారి కాలువలో పడిందనుకున్నారు.. కానీ ఇంట్లో పరుపు శుభ్రం చేస్తుండగా.. బయటపడిన పేపర్‌తో..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

హోటల్‌లో ఉన్న young woman.. కాసేపటికి కారులో ప్రత్యక్షం.. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. అని ప్రియుడిని అడగడంతో.. Shocking incident: జెండా పండుగకు వెళ్లిన పిల్లలు.. వారి కోసం ఎదురు చూస్తున్న తల్లి.. తలుపులు తీసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా.. Engagement పంక్షన్‌లోకి వచ్చి.. యువకుడి ముక్కు, చెవులు కట్ చేసిన బంధువులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..girlfriend పుట్టింటికి వచ్చిందని తెలుసుకున్న ప్రియుడు.. ఆమెకు ఫోన్‌లోని వీడియోలను చూపించిన అనంతరం.. school మేనేజర్‌ను హోటల్‌కు పిలిపించుకున్న ఉపాధ్యాయురాలు.. మరుసటి రోజు వచ్చిన ఫోన్ కాల్‌తో అవాక్కయిన వ్యక్తి..Groom market: పెళ్లి కొడుకుల సంత గురించి మీకు తెలుసా.. తొమ్మిది రోజుల ప్రదర్శనలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.