వేసవిలో కాఫీ, టీలు తాగుతున్నారా! అయితే ఇది తెలుసుకోండి..

Published: Tue, 05 Apr 2022 12:58:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వేసవిలో కాఫీ, టీలు తాగుతున్నారా! అయితే ఇది తెలుసుకోండి..

ఆంధ్రజ్యోతి(05-04-2022)

వేసవి వాతావరణం అజీర్తిని పెంచుతుంది. శరీరంలో ఉష్ణాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి కొన్ని ఆహార నియమాలు పాటించక తప్పదు. 


అవేంటంటే...

కారం, మసాలా: జీవక్రియలు మందగించడానికి కారణం శరీరంలో వేడి పెరగడమే! కాబట్టి వేడిని పెంచే కారం, మసాలాలకు ఈ కాలంలో దూరంగా ఉండాలి.

మాంసాహారం: వేసవిలో జీర్ణశక్తి తగ్గుతుంది. కాబట్టి జీర్ణాగ్నికి పరీక్ష పెట్టే మాంసాహారం మితంగా తీసుకోవాలి.

కాఫీ, టీ: ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అలా జరగకుండా ఉండాలంటే నీటి శాతాన్ని పెంచి, కాఫీలు, టీలు తగ్గించాలి.

వేపుళ్లు: నూనెలో వేయించిన పదార్థాలు తినడం తగ్గించాలి. ఇవి దాహార్తిని పెంచుతాయి. 

శీతల పానీయాలు: చక్కెర శరీరంలోని నీటిని విపరీతంగా పీల్చుకుంటుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌ పెరుగుతుంది. కాబట్టి చక్కెర అధికంగా ఉండే శీతల పానీయాలకు బదులుగా మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలి.

చల్లని నీళ్లు: చల్లని నీటితో దాహం తీరకపోగా, జీర్ణమై రక్తంలో కలవడానికి ఎక్కువ సమయం పడుతుంది. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండాలంటే, అతి చల్లని నీళ్లు తాగవద్దు.

ఒఆర్‌ఎస్‌: ఎండలో ఎక్కువ సమయాలు గడిపినా, ఎండ వేడి సోకినా శరీరంలోని ఖనిజ లవణాలు చమట రూపంలో వెళ్లిపోతాయి. కాబట్టి వాటిని ఒఆర్‌ఎస్‌ ద్రావణంతో భర్తీ చేస్తూ ఉండాలి. ఉప్పు, చక్కెర కలిపిన నీరును ఒఆర్‌ఎస్‌ ద్రావణంగా తీసుకోవచ్చు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.