ఈ విద్యార్థినులంతా కలిసి అందరి ముందే.. బస్సులో చేసిన పని.. చివరికి విషయం బయటికి తెలియడంతో..

Published: Thu, 24 Mar 2022 18:27:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈ విద్యార్థినులంతా కలిసి అందరి ముందే.. బస్సులో చేసిన పని.. చివరికి విషయం బయటికి తెలియడంతో..

నేటి తరం విద్యార్థుల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటోంది. బాగా చదువుకుని, మంచి ఉద్యోగంలో స్థిరపడాలనే తపన కొందరిలో అసలు కనిపించడం లేదు. చెడు స్నేహాలు, దురలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. ఈ క్రమంలో వారు చేసే పనులు.. చివరికి వారి జీవితాలను నాశనం చేయడంతో పాటూ ఎదుటి వారికి కూడా ఇబ్బందులను తెచ్చిపెడుతున్నారు. ఇటీవల కొందరు విద్యార్థినులు కూడా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. తాజాగా తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థినులు.. అందరి ముందే బస్సులో చేసిన పని సంచలనం కలిగిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తమిళనాడు రాష్ట్రం చెంగ‌ల్‌ప‌ట్టు పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ బస్సులో కొంతమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ప్రయాణిస్తుంటారు. ఈ సమయంలో ఓ విద్యార్థిని బీరు బాటిల్‌ని బయటికి తీసి తాగడం మొదలుపెడుతుంది. ఇంతలో పక్కనే ఉన్న విద్యార్థినులు ఆ బాటిల్‌ను లాక్కుని తాగుతుంటారు. ఇలా పోటీలు పడి మరీ వారు బీరు తాగిన తీరు తీవ్ర సంచలనానికి దారి తీసింది. ఇంత జరుగుతున్నా బస్సులో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విద్యార్థినులు బీరు తాగుతున్న సమయంలో కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

భర్త దూరమై బాధలో ఉన్న మహిళకు సోదరుడి ఓదార్పు.. ఇద్దరిమధ్య అనూహ్యంగా చిగురించిన ప్రేమ.. ఓ రోజు గ్రామస్తులకు తెలియడంతో

ఇవి కూడా చదవండిLatest News in Telugu

నిశ్చితార్థం జరిగిన తర్వాత రద్దయిన పెళ్లి.. అయినా ఆమే భార్యగా కావాలంటూ.. యువకుడు చేసిన పని..ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు.. 9నెలల తర్వాత ఓ రోజు లేఖలో ఇలా రాసి.. ఆమె చేసిన పని.. బాత్‌రూంకు వెళ్లేందుకు వేచి ఉన్న మహిళ.. మరో బాత్‌రూంకు వెళ్లండంటూ తాళాలు ఇచ్చిన రైల్వేస్టేషన్‌ స్వీపర్.. చివరకు Viral Video: వీడి హోలీ మామూలుగా లేదుగా.. రంగులు చల్లకుండా ఏకంగా... వామ్మో...video‘‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’’పై క్లాసులో చెబుతుండగా.. పైకి లేచిన బాలిక.. తండ్రి, సోదరుడు, తాత, మామ గురించి ఆమె చెప్పింది విని..మేడమ్! మసాజ్ చేయించుకుంటే సమస్యలు దూరమవుతాయ్.. అంటూ టూరిస్ట్‌తో అన్నాడు.. గదిలోకి వెళ్లిన కాసేపటికి చూస్తే..


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.