‘బాలన్‌ డి ఓర్‌’ జాబితాలో మెస్సీకి దక్కని చోటు

Published: Sun, 14 Aug 2022 03:28:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బాలన్‌ డి ఓర్‌ జాబితాలో  మెస్సీకి దక్కని చోటు

నయాన్‌ (స్విట్జర్లాండ్‌): ఫుట్‌బాల్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డు నామినేషన్ల జాబితాలో.. ఏడుసార్లు విజేత అర్జెంటీనా స్టార్‌ లియోనెల్‌ మెస్సీకి చోటు దక్కలేదు. ఈ ఏడాది అవార్డు కోసం పోటీపడే 30 మంది ఆటగాళ్ల జాబితాను ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ విడుదల చేసింది. అయితే, 2005 తర్వాత తొలిసారి మెస్సీకి ఈ జాబితాలో చోటుదక్కలేదు.. కరీమ్‌ బెంజిమా (ఫ్రాన్స్‌) అవార్డు రేస్‌లో ముందుండగా.. పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డో కూడా పోటీపడుతున్నాడు. పారిస్‌ జెయింట్స్‌ తరఫున ఆడిన తొలి సీజన్‌లో పేలవ ప్రదర్శన కారణంగానే మెస్సీకి నామినేషన్‌ దక్కలేదని తెలుస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.