పత్తిపంటలో... గులాబీ రంగు పురుగును నివారించండి

ABN , First Publish Date - 2021-10-26T06:24:47+05:30 IST

జి ల్లాలో సాగు చేసిన పత్తి పంటలో గు లాబి రంగు, కాయ తొలుచు పురుగుల ఉధృతి ఉందని, వా టి నివారణకు రైతు లు యాజమాన్య ప ద్ధతులు పాటించా లని రెడ్డిపల్లి ఏరువాక కోఆర్డినేటర్‌ రామ సుబ్బయ్య సూచించారు.

పత్తిపంటలో...  గులాబీ రంగు పురుగును నివారించండి
రేగడికొత్తూరులో పత్తి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల బృందం

బుక్కరాయ సముద్రం, అక్టోబరు25: జి ల్లాలో సాగు చేసిన పత్తి పంటలో గు లాబి రంగు, కాయ తొలుచు పురుగుల ఉధృతి ఉందని, వా టి నివారణకు రైతు లు యాజమాన్య ప ద్ధతులు పాటించా లని రెడ్డిపల్లి ఏరువాక కోఆర్డినేటర్‌ రామ సుబ్బయ్య సూచించారు. మండల పరిధిలోని రేగడికొత్తూరులో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖాధికారుల బృందం సోమవారం పర్యటించింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... పత్తి పంటలో రైతుల తప్పనిసరిగా లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించా రు. వీటితో పాటు 45 రోజుల నుంచి 120 రోజుల లోపల ప్రాఫినోఫాస్‌ 2మి.లీ. లేదా ధయాడికార్బ్‌ 1.5గ్రామలు లేదా క్లోరోఫైరిఫాస్‌ 2.5 మి.లీ,  లేదా క్వినాల్‌ ఫాస్‌ 20 మి.లీ.ను లీటరు నీటికి  కలిపి పిచికారి చేయాలని సూచించారు. సకా లంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడలను సాధించవచ్చుని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త శివజ్యోతి, డీడీఏ మద్దిలేటి, ఏఓ శ్యాం సుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శింగనమల : పత్తి పంటలో గులాబిరంగు పురుగు పెరగకుండా సమగ్ర నివా రణ చర్యలు పాటించాలని వ్యవసాయశాఖ డీడీఏ మద్దిలేటి, శాస్త్రవేత్తలు రామ సుబ్బయ్య, శివజ్యోతి పేర్కొన్నారు. మండలంలోని పోతురాజు కాలువ గ్రామం లో పత్తి పంటను  సోమవారం వారు పరిశీలించారు.  సమగ్ర నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఏఓ చిన్నమ్మ, రైతులు పాల్గొన్నారు.

 కందిలో సస్యరక్షణ చర్యలు పాటించండి

ఆత్మకూరు  : కంది పంటలో సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు  సాధించవచ్చునని మండల వ్యవసాయాధికారి శ్రీనాథరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బీ యాలేరులో సాగుచేసిన కందిపంటను స్థానిక వ్యవసా యాధికారులు సోమవారం  పరిశీలించారు. ఈ సందర్బంగా  వారు మాట్లాడు తూ... ప్రస్తుతం పూతదశలో ఉన్నందున పంటను ఆకుచుట్టు పురుగు ఆశిం చిందని తెలిపారు. దీనితో పాటు వెర్రితెగులు నివారణకు తీసుకోవలసిన చర్యలు, పాటించ వలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ కారక్ర మంలో వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T06:24:47+05:30 IST