చివరికి గెలిచేది అహింసే

ABN , First Publish Date - 2022-10-07T05:00:26+05:30 IST

చివరికి గెలిచేది అహింసేనని, సమతా వాదమే పరిష్కారమని గౌతమబుద్ధుడు నిరూపిం చాడని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యా టక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

చివరికి గెలిచేది అహింసే
బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి

- శాంతి, సమానత్వమే బుద్ధుని మార్గం : మంత్రి

పాలమూరు, అక్టోబరు 6 : చివరికి గెలిచేది అహింసేనని, సమతా వాదమే పరిష్కారమని గౌతమబుద్ధుడు నిరూపిం చాడని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యా టక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. బుధవారం క్రిస్టియన్‌ప ల్లిలో మహామాయ గౌతమబుద్ధ విహార్‌లో బుద్ధ, అశోక విగ్రహాలను మంత్రి ఆవిష్కరించి, బుద్ధవిహార్‌కు భూమిపూజ చేసి రూ.పదిలక్షల నిధులు మంజూరు చేశారు. జాతి, కుల, వర్ణ, వర్గ విభేదాలతో, కక్షలతో, కార్పణ్యాలతో సతమతమయ్యే సమాజంలో శాంతి స్థాపనకు బుద్ధుని మార్గమే ఆచరణీయమని మంత్రి పేర్కొన్నారు. శాంతి, సమానత్వమే బుద్ధుని మార్గమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నరసింహులు, కౌన్సిలర్‌ రాణి, కో-ఆప్షన్‌ సభ్యులు వరలక్ష్మి, బుద్ధవిగ్రహ కమిటీ అధ్యక్షుడు ఆది లక్ష్మయ్య, కార్యదర్శి వడ్డెమాన్‌ బాలపీరు, పీపీ స్వదేశ్‌, చెరుకుపల్లి రాజేశ్వర్‌, డా.రామ్మోహన్‌, పట్నం చెన్నయ్య, హనుమంతు, రాములు, రాజుపాల్గొన్నారు. 

- ఘనంగ విజయదశమి వేడుకలు

బౌద్ధ ధర్మ సమాజ్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బౌద్ధాల యం (ఎస్‌సీ కమ్యూనిటీ హాలు ఆవరణ)లో విజయదశమి వేడుకలను ఘనంగ నిర్వహిం చారు. కార్యక్రమంలో కార్యదర్శి గడ్డమీది గోపాలక్రిష్ణ, రామలింగం, రవికిరణ్‌, అశోక్‌ కుమార్‌, భూపతివెంకట్‌, రామకృష్ణ, సురేష్‌, జగన్‌, ప్రసాద్‌, అరుణ్‌, రవికుమార్‌, శ్రావణ్‌, వెంకట్రా ములు, ఆది లక్ష్మయ్య, వడ్డెమాన్‌ బాలపీరు, పట్నం చెన్నయ్య, రాయికంటి రాందాసు, సింగిరెడ్డి పరమేశ్వర్‌, పి.రమేష్‌ పాల్గొన్నారు. 

ఫ పట్టణంలోని పెద్దశివాలయం దగ్గర బుధవారం మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ భక్తుల సౌకర్యార్థం రూ.ఐదు లక్షలతో మోడ్రన్‌ టాయిలెట్స్‌కు భూమిపూజ చేశారు. 

ఫ పట్టణంలోని వీరన్నపేటలోని యాదవ కమ్యూనిటీ హాలు వద్ద రూ.ఐదు లక్షలతో ని ర్మించిన షెడ్డును మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ముని సిపల్‌ చైర్మన్‌ కే.సి నరసింహులు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు శాంతన్న, కె.రాములు, సత్యం యాదవ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు


వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం

- మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 6 : వర్షం వచ్చిన ప్రతీసారి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, నాలా లు ఆక్రమణకు గురవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నిబంధ నల ప్రకారం నాలాలను వెడల్పుచేసి వరదకు శాశ్వత పరి ష్కారం చూపుతామన్నారు. రామయ్యబౌళిలో నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారంతా అధికారులకు సహకరించాలన్నారు. గురువారం వరదలపై మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ కలెక్టరేట్‌లో అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. వర్షం కురిసినపుడల్లా రామయ్యబౌళి, బీకె రెడ్డి కాలనీ, శివశక్తినగర్‌ ప్రాంతాలకు నీరురావడం వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్ల వరదలు వస్తున్నాయని, పెద్దచెరువు, ఎర్రకుంట అలుగులు వెళ్లే ప్రాంతాలలో నాలాలు ఆక్రమణకు గురవడం వల్ల ఇళ్లలోకి నీరుచేరుతోందన్నారు. రామయ్యబౌళిలో 100 ఫీట్ల నాలా 5 ఫీట్లకు తగ్గిపోయిందని, బీకె రెడ్డి కాలనీలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. రామయ్యబౌళిలో 67 ఇళ్లు నాలా ఆక్రమించి కట్టుకోగా 32 ఇండ్లు బఫర్‌ జోన్‌లో ఉన్నాయని, అధికారులు నివేదించారన్నారు. వీటన్నింటిని తొలగిస్తే సహజసిద్ధంగా ముంపునకు గురవకుండా నీరు వెళుతుందన్నారు. పోలీస్‌, రెవెన్యూ, మునిసిపల్‌ సిబ్బంది నిష్పక్షపాతంగా ఆక్రమణలు తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ అభివృద్ధి విషయంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నామన్నారు. వర్షాలు తగ్గిన తరువాత 15 రోజుల్లో కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తా మని మంత్రి వెళ్ళడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావ్‌, ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, ఇరిగేషన్‌ అధికారులు చక్రధర్‌, దయానంద్‌, మనోహర్‌, కమిసనర్‌ ప్రదీప్‌కుమార్‌, తహసీల్దార్‌ పార్థసారథి పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T05:00:26+05:30 IST