కొండవీడు అడవుల్లో...

Published: Wed, 06 Jul 2022 00:20:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కొండవీడు అడవుల్లో...

బిగ్‌బాస్‌ ఫేమ్‌ శ్వేతావర్మ, ప్రతా్‌పరెడ్డి, శ్రీకృష్ణ నటీనటులుగా తెరకెక్కిన చిత్రం ‘కొండవీడు’. అటవీ నేపథ్యంలో సాగే మిస్టరీ థ్రిల్లర్‌. ఈ నెల 8న థియేటర్లలో విడుదలవుతోంది. సిద్ధార్థ శ్రీ దర్శకత్వంలో బోధన్‌పల్లి ప్రతా్‌పరెడ్డి నిర్మించారు. ఆయన మాట్లాడుతూ ‘చాలా కష్టపడి అడవుల్లో షూటింగ్‌ చేశాం. పాటలకు మంచి ఆదరణ వచ్చింది. శ్వేతావర్మ పాత్ర అలరిస్తుంది’ అన్నారు. సిద్ధార్థ శ్రీ మాట్లాడుతూ ‘ఫైట్స్‌, పాటల చిత్రీకరణలో ప్రతా్‌పరెడ్డి ఖర్చుకు వెనుకాడలేదు. టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు మా చిత్రంలో ఉన్నాయ’న్నారు. శ్వేతావర్మ మాట్లాడుతూ ‘కొవిడ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకొని, షూటింగ్‌ చేశాం. దర్శకుడి విజన్‌ తెరపైన అద్భుతంగా కనిపిస్తుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలి’ అని కోరారు. ఈ చిత్రానికి కనిష్క సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: రఘు రాయల్‌.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International