మద్యం దుకాణంలో చోరీ కేసు ఛేదింపు

ABN , First Publish Date - 2021-12-03T06:07:13+05:30 IST

మండల కేంద్రంలోని ముట్టాల రోడ్డు సమీపాన మద్యం దుకాణంలో రెండు రోజుల క్రితం జరిగిన చోరీ కేసును గురువారం డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఆదేశాలు మేరకు విచారించి, ఛే దించినట్లు సీఐ శివశంకర్‌నాయక్‌ తెలిపారు.

మద్యం దుకాణంలో చోరీ కేసు ఛేదింపు


ఆత్మకూరు, డిసెంబరు2 : మండల కేంద్రంలోని ముట్టాల రోడ్డు సమీపాన మద్యం దుకాణంలో రెండు రోజుల క్రితం జరిగిన చోరీ కేసును గురువారం డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఆదేశాలు మేరకు విచారించి, ఛే దించినట్లు సీఐ శివశంకర్‌నాయక్‌ తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం దుకాణంలో రోజూ వ్యాపారం ముగిసిన తరువాత నగ దును దుకాణంలోనే ఉంచి, మరునాటి ఉదయాన్నే బ్యాంకులో జమచేస్తా రు. ఈ విషయాన్ని గమనించిన దుకాణంలో పనిచేసే సిబ్బందిలోని ఓ వ్యక్తి పథకం ప్రకారం... రాత్రి మద్యం షాపు దగ్గర ఉన్న వాచమ్యాన భో జనం చేయడానికి వెళ్లగానే దుకాణం తలుపులు తీసి రూ. 3లక్షలు నగ దు ను ఎత్తుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం బ్యాంకులో జమచేయడానికి న గదు లెక్కించగా తక్కువ వచ్చింది. మిగిలిన సిబ్బంది ఆశ్చర్యపోయి ఎక్సైజు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎక్సైజు పోలీసు అధికారులు స్థానిక పోలీసు లను ఆశ్రయించడంతో... వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించడంతో అసలు విషయం బయట పడినట్లు సీఐ వివరించారు. నిందితుడి నుంచి రూ. 3లక్షలు రికవరీ చేసి కోర్టుకు హాజరు పర్చినట్లు తెలిపారు.



Updated Date - 2021-12-03T06:07:13+05:30 IST