‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్ విడుదల చేసిన కార్తి

Jun 12 2021 @ 13:31PM

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్‌జీ) జూన్ 18న విడుద‌లవుతుంది. ప్రియ‌ద‌ర్శి, నందినీ రాయ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. విద్యాసాగ‌ర్ ముత్తు కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సురేష్ కృష్ణ నిర్మించారు. ఈ అవెయిటింగ్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను శ‌నివారం తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన స్టార్ హీరో కార్తి విడుద‌ల చేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. 

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్‌జీ)డ్ వెబ్ సిరీస్‌ చ‌క్క‌టి విజువ‌ల్ ట్రీట్‌గా, రా కంటెంట్‌, ఎమోష‌న్స్‌, డ్రామా, యాక్ష‌న్, చ‌క్క‌టి డైలాగ్స్ క‌ల‌బోత‌గా  ఉంది. ఆది(ప్రియ‌ద‌ర్శి) అనే ప్ర‌మాద‌క‌ర‌మైన యువ‌కుడి క‌థే. మీనా(నందినీ రాయ్‌) అనే అమ్మాయితో ఆది రిలేష‌న్ ఏంటి?  జీవితంలో అత‌ను ఎదుర్కొన్న ఎత్తుప‌ల్లాలేంటి? అనే విషయాలు ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌పై మరింత ఆస‌క్తిని పెంచుతున్నాయి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.