Money insurance: ఈ విషయం తెలియక చాలా మంది డబ్బు నష్టపోతుంటారు.. దొంగతనం జరిగినా బేఫికర్‌గా ఉండే చక్కటి మార్గం ఇదీ

ABN , First Publish Date - 2022-09-16T23:34:05+05:30 IST

డబ్బులు చెట్లకు కాయవు. నానా కష్టాలు పడి చెమటోడ్చి సంపాదించిన డబ్బుకి సరైన రక్షణ లేకుండా శ్రమంతా మట్టిలో కలిసిపోతుంది. అయితే డబ్బుకు చక్కటి రక్షణ కవచంలాగా అందుబాటులో ఉన్న మార్గాల్లో మనీ ఇన్సూరెన్స్(Money insurance) ఒకటి.

Money insurance: ఈ విషయం తెలియక చాలా మంది డబ్బు నష్టపోతుంటారు.. దొంగతనం జరిగినా  బేఫికర్‌గా ఉండే చక్కటి మార్గం ఇదీ

బ్బులు చెట్లకు కాయవు. నానా కష్టాలు పడి చెమటోడ్చి సంపాదించిన డబ్బుకి సరైన రక్షణ లేకుండా శ్రమంతా మట్టిలో కలిసిపోతుంది. అయితే డబ్బుకు చక్కటి రక్షణ కవచంలా అందుబాటులో ఉన్న మార్గాల్లో మనీ ఇన్సూరెన్స్(Money insurance) ఒకటి. వాస్తవానికి జీవితబీమాపై భారతీయ సమాజంలో అవగాహన బాగానే ఉంది. కానీ నగదు(Money)కు కూడా ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిసినవారు, ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నవారి సంఖ్య తక్కువనే చెప్పాలి. మనీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసే వ్యక్తులు.. నగదు లేదా నగదు సమానమైన బ్యాంక్ డ్రాఫ్ట్స్, ట్రెజరీ నోట్స్, చెక్కులు, పోస్టల్ ఆర్డర్లు, మనీ ఆర్డర్ల వంటివాటికి ఇన్సూరెన్స్ కవరేజీ(insurance Covarage) ఉంటుంది. దొంగతనం లేదా దోపిడీ కారణంగా నష్టం జరిగితే కస్టమర్లు తమ డబ్బుని ఇన్సూరెన్స్ రూపంలో తిరిగి పొందొచ్చు.


ప్రయాణం లేదా సురక్షిత ప్రాంతాల నుంచి నగదు తస్కరణకు గురయితే మనీ ఇన్సూరెన్స్ రూపంలో కవరేజీ(coverage) లభిస్తుంది. కస్టమర్లు మనీ ఇన్సూరెన్స్‌(Money insurence)లో లభించే అన్నీ ప్రయోజనాలు పొందొచ్చు. లేదంటే తమతమ అవసరాలు, పరిస్థితులకు తగ్గట్టుగా ప్రయోజనాలను ప్రత్యేకించి ఎంపిక చేసుకోవచ్చు. నిజానికి కొన్ని వ్యాపారాలు పెద్ద మొత్తంలో డబ్బుతో ముడిపడి ఉంటాయి. భారీ మొత్తంలో లావాదేవీలు  జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో డబ్బు దొంగతనం లేదా దోపిడీకి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కొనే మార్గాల్లో మనీ ఇన్సూరెన్స్ ఒకటిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని, చాలా ఉపయోకరమని రెన్యూబై(RenewBuy) కంపెనీ ఇంద్రనీల్ చటర్జీ సూచించారు. అనూహ్యంగా దొంగతనం లాంటి ఘటనల్లో డబ్బు పోగొట్టుకుంటే మనీ ఇన్సూరెన్స్ రూపంలో నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చునని ఆయన సలహా ఇచ్చారు. 


కవరేజీ వేటికి?

నగదు, చెక్కులు, డ్రాఫ్ట్స్, ట్రెజరీ నోట్స్, కరెన్సీ నోట్స్, పోస్టల్ ఆర్డర్స్ వంటి  లిక్విడ్ అన్నీ రకాల ఫండ్స్‌కు మనీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ప్రీమియం ఇన్సూరెన్సులు తీసుకుంటే పెద్ద మొత్తంలో సొమ్మును కోల్పోయినప్పుడు కూడా న్యాయం జరుగుతుందని ఛటర్జీ చెప్పారు. సాధారణంగా జీవితబీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా తీసుకుంటుంటారు. కానీ చాలా ముఖ్యమైన వ్యాపారాలకు ఇన్సూరెన్స్ తీసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుందని పరిస్థితిని వివరించారు. మనీ ఇన్సూరెన్స్ కలిగివుంటే ఆఫీస్ నుంచి బ్యాంక్‌కు లేదా ఏదైనా ఫైనాన్సియల్ సంస్థకు తీసుకెళ్తున్న సమయంలో అపహరణకు గురయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపార సంస్థలో డబ్బుని దొంగలు దోచుకెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.


కవరేజీ లేనివి ఏవి?

తప్పిదం జరిగినప్పుడు లేదా సంస్థతో సంబంధంలేని వ్యక్తిని నమ్మి డబ్బు అప్పగించినప్పుడు ఆ డబ్బు దొంగతనానికి గురయితే ఇన్సూరెన్స్ కవరేజీ ఉండదు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టాలు.. అంటే వరదలు, తుఫాన్లు, యుద్ధాలు, యుద్ధం తరహా ఆపరేషన్ల పర్యవసానంగా డబ్బు కోల్పోవడం మనీ ఇన్సూరెన్స్ పరిధిలో ఉండదు. మనీ  లేదా క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే ముందు కస్టమర్లు డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవి, సందేహాలను నివృతి చేసుకున్నాక పాలసీ తీసుకోవడం అత్యుత్తమం.

Updated Date - 2022-09-16T23:34:05+05:30 IST