Viral Video: దారికి అడ్డంగా నిల్చున్న వ్యక్తి.. కోపంతో ఊగిపోయిన ఏనుగు.. ఏం చేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు

ABN , First Publish Date - 2022-07-01T14:17:59+05:30 IST

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఏనుగు సంబంధించిన వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు ఆ వీడియో చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇదే సమయంలో.. తన దారికి అడ్డంగా నిల్చున్న వ్యక్తిపట్ల ఆ ఏనుగు

Viral Video: దారికి అడ్డంగా నిల్చున్న వ్యక్తి.. కోపంతో ఊగిపోయిన ఏనుగు.. ఏం చేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఏనుగు సంబంధించిన వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు ఆ వీడియో చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇదే సమయంలో.. తన దారికి అడ్డంగా నిల్చున్న వ్యక్తిపట్ల ఆ ఏనుగు కనబర్చిన ఆగ్రహాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు. ‘గజరాజుకు కోపం వస్తే అంతే మరి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ‘నెటిజన్లు అంతలా రియాక్ట్ కావడానకి ఆ వీడియోలో ఏముంది’ అని అనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..  



సాధారణంగా వెళ్లే దారిలో ఎవరైనా అడ్డొస్తే.. మనం ఏం చేస్తాం.. మర్యదగా పిలిచి పక్కకు తప్పుకోవాల్సిందిగా కోరుతాం. సదరు వ్యక్తి మాట వినకపోతే.. మనమే పక్క నుంచి వెళ్లిపోతాం. కానీ ఓ ఏనుగు మాత్రం.. తన దారికి అడ్డొచ్చిన ఓ వ్యక్తిని తనదైన స్టైల్‌లో పక్కకు వెళ్లేలా చేసింది. వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాల ప్రకారం.. సుదీర్ఘంగా ఆలోచిస్తూ రోడ్డుపై ఓ వ్యక్తి నిల్చొని ఉండగా.. పొదల్లోంచి అటువైపుగా ఏనుగు వచ్చింది. తన దారికి అడ్డంగా ఉన్న వ్యక్తిని చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఘీంకరించి తన రాకను అతడికి తెలియజేయడానికి ఇష్టపడని ఆ ఏనుగు.. కాలుతో మంటిని సదరు వ్యక్తిపైకి ఎగదోసింది. అకస్మాత్తుగా మట్టి ఎగసి పడటంతో ఉలిక్కిపడ్డ అతడు.. ఏనుగు చూసి భయాందోళనలకు గురయ్యాడు. వెంటనే పక్కకు తప్పుకుని దానికి దారిచ్చాడు. దీంతో ఏనుగు హుందాగా నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయింది.


ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో దాన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోకాస్తా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇంకా నయం.. తొండంతో ఎత్తి పడేయకుండా.. కేవలం మట్టిని మాత్రమే అతడిపైకి ఎగదోసింది’ అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరేమో ‘ఆ ఏనుగు బాగా ప్రస్టేషన్‌లో ఉన్నట్టుంది’ అంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు. 



Updated Date - 2022-07-01T14:17:59+05:30 IST