వేదికపై వధూవరులు.. అతి పెద్ద పార్శిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఫ్రెండ్స్.. అందులో ఏముందో చూసి అవాక్కైన కొత్త జంట..!

ABN , First Publish Date - 2021-12-10T19:07:22+05:30 IST

కొత్తగా పెళ్లైన వధూవరులకు సాధారణంగా బంధువులు, స్నేహితులు తమకు తోచిన విధంగా గిప్ట్‌లు ఇస్తూ ఉంటారు. గిఫ్ట్‌ల రూపంలో తమ ప్రేమాభిమానాలను ఆ వధూవరులపై వ్యక్త పరచడం సహజం. ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లి చేసుకుని, గ్రాండ్ లు

వేదికపై వధూవరులు.. అతి పెద్ద పార్శిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఫ్రెండ్స్.. అందులో ఏముందో చూసి అవాక్కైన కొత్త జంట..!

ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా పెళ్లైన వధూవరులకు సాధారణంగా బంధువులు, స్నేహితులు తమకు తోచిన విధంగా గిప్ట్‌లు ఇస్తూ ఉంటారు. గిఫ్ట్‌ల రూపంలో తమ ప్రేమాభిమానాలను ఆ వధూవరులపై వ్యక్త పరచడం సహజం. ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లి చేసుకుని, గ్రాండ్ లుక్‌తో రిసెప్షన్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన నూతన వధూవరులకు ఫ్రెండ్స్ అతిపెద్ద పార్శల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. సందడి చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ తెచ్చిన పార్శల్‌లో ఏముందో చూసి.. కొత్త జంట అవాక్కైంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఆ నూతన వధూవరులకు ఫ్రెండ్స్ పార్శల్‌లో ఏమిచ్చారనే వివరాల్లోకి వెళితే..



పెళ్లి తర్వాత పూలతో అందంగా ముస్తాబు చేసిన స్టేజీపైకి గ్రాండ్ లుక్‌తో కొత్త జంట ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో కొందరు ఫ్రెండ్స్.. అతి పెద్ద పార్శిల్‌ను ఆపసోపాలు పడుతూ స్టేజీ వద్దకు తీసుకొచ్చారు. దాన్ని కొత్త జంటకు అందజేసి, ఫోటలకు ఫోజులిచ్చారు. అనంతరం ఆ పార్శిల్.. వధూవరుల చేతుల్లో ఉండగానే.. అందరూ దాన్ని స్టేజీ దిగడం ప్రారంభించారు.  అంతకష్టపడి మోసుకొచ్చిన పార్శిల్.. చాలా తేలిగ్గా ఉండటంతో వధూవరులు కంగుతిన్నారు.  ఆ తర్వాత అది ఒట్టి ఖాళీ డబ్బానే అని గ్రహించి.. పక్కన పారేశారు. దీంతో ఆ పార్శిల్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ పక్కనే స్టేజ్ పక్కనే ఉండి.. పడి పడి నవ్వారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికస్తా వైరల్‌‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 






Updated Date - 2021-12-10T19:07:22+05:30 IST