కొరియన్ యువకుడిని పెళ్లి చేసుకున్న భారత యువతి.. ఆమె వస్త్రధారణ చూసి శభాష్ అంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-04-27T22:04:22+05:30 IST

ఆమె భారత యువతి. కొరియన్ యువకుడిని మరోమారు పెళ్లి చేసుకుంది. అనంతరం భర్తతో కలిసి సన్నహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కొరియన్ యువకుడిని పెళ్లి చేసుకున్న భారత యువతి.. ఆమె వస్త్రధారణ చూసి శభాష్ అంటున్న నెటిజన్లు!

ఎన్నారై డెస్క్: ఆమె భారత యువతి. కొరియన్ యువకుడిని మరోమారు పెళ్లి చేసుకుంది. అనంతరం భర్తతో కలిసి సన్నహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే వీడియో ఆమె వస్త్రధారణను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

 


ఇండియాకు చెందిన నేహా, దక్షిణ కొరియాకు చెందిన జాంగ్‌సూ ఒకరికొకరు నచ్చారు. దీంతో వీరిద్దరికీ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో భారతీయ సంప్రదాయం ప్రకారం పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొరియాకు వెళ్లి, అక్కడి సంప్రదాయాల ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేహా, జాంగ్‌సూ తమ సన్నిహితుల గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధమైన చీర కట్టులో నేహా తళుక్కుమంది. భారతీయ సంప్రదాయం ప్రకారం అందంగా ముస్తాబై భర్తతో కలిసి అతిథులను పలకరించింది. కొరియాలో జరిగిన పెళ్లి తాలూకు సన్నివేశాలను డాక్యుమెంట్ రూంలో ఈ జంట తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. నేహా వస్త్రధారణ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. కొరియాలో పార్టీ ఇచ్చినప్పిటికీ భారత మూలాలు మరవనందుకు ‘శభాష్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-04-27T22:04:22+05:30 IST