వైరల్ అవుతున్న Ola స్కూటర్ వీడియో.. సందిగ్ధంలో ఎలక్ట్రిక్ వాహన ప్రియులు!

Published: Sun, 27 Mar 2022 12:54:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వైరల్ అవుతున్న Ola స్కూటర్ వీడియో.. సందిగ్ధంలో ఎలక్ట్రిక్ వాహన ప్రియులు!

ఇంటర్నెట్ డెస్క్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ షాకింగ్ ఘటనను చూసి, ఎలక్ట్రిక్ వాహన ప్రియులు అయోమయానికి లోనవుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు సేఫేనా అనే అలోచనలో పడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లో వెళితే..


పెట్రోల్, డిజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సగటు మధ్యతరగతి వ్యక్తి తన రోజు వారి సంపాదనలో సుమారు సగం డబ్బును పెట్రోలు, డిజిల్‌కే ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో సామాన్యులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సంస్థలు ప్రజలకు తీపి కబురు చెప్పాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకురానున్నట్టు వెల్లడించాయి. అంతేకాకుండా ఆ బైక్‌ల ఖరీదు కూడా అందుబాటు ధరల్లోనే తీసుకొస్తున్నట్టు చెప్పాయి. ఇలా ప్రకటించిన కంపెనీల్లో ఓలా కూడా ఉంది. ముందుగా చెప్పిన విధంగా ఓలా.. కొద్ది రోజుల క్రితం ఓలా ఎస్1 ప్రో పేరుతో ఎలక్ట్రిక్‌ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. కంపెనీకి ప్రజల్లో మంచి పేరు ఉండటంతో.. పూణేకు చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఈ బైక్‌ను కొనుగోలు చేశాడు. తాజాగా శనివారం రోజు ఆ బైక్‌పై బయటికెళ్లి, ఓ షాపింగ్ మాల్ ముందు పార్క్ చేశాడు. అయితే పార్క్ చేసిన 31 సెకన్లలోనే బ్యాటరీ నుంచి మంటు చెలరేగి.. ఆ బైక్‌కు నిప్పంటుకుంది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారడంతో.. ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఆలోచనల్లో పడ్డారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు సేఫేనా కాదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఓలా సంస్థ స్పందించింది. స్కూటర్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్టు చెప్పింది. ఆ బైక్‌ను కొనుగోలు చేసిన వ్యక్తితో టచ్‌లో ఉన్నట్టు వెల్లడించింది. 




Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.