విషాలు వదలాలంటే...

ABN , First Publish Date - 2022-08-02T17:34:04+05:30 IST

రోమా ఆయిల్స్‌ కలిపిన నీళ్లలో మునిగి, సేద తీరడం వల్ల శరీరంలోని విషాలు తొలగిపోయి, మనసుకు

విషాలు వదలాలంటే...

రోమా ఆయిల్స్‌ కలిపిన నీళ్లలో మునిగి, సేద తీరడం వల్ల శరీరంలోని విషాలు తొలగిపోయి, మనసుకు స్వాంతన చేకూరుతుందని విన్నాం. అయితే అంతటి సౌలభ్యం లేనివాళ్లు పాదాలను నీళ్లలో ముంచి ఉంచడం ద్వారా కూడా అంతే సమానమైన ఫలితాన్ని పొందవచ్చు. అందుకోసం....


రెండు కప్పుల బేకింగ్‌ సోడా, ఒక కప్పు ఎప్సమ్‌ సాల్ట్‌, ఒక నిమ్మకాయ, పది చుక్కల లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌.. వీటన్నిటినీ గోరువెచ్చని లేదా వేడి నీళ్లలో కలిపి, ఈ నీళ్లలో 30 నిమిషాల పాటు పాదాలను ముంచి ఉంచాలి. తర్వాత పాదాలను సున్నితంగా శుభ్రం చేసి, మాయిశ్చరైజర్‌ అద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల బడలిక వదలడంతో పాటు, శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.

Updated Date - 2022-08-02T17:34:04+05:30 IST