ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే... ఈ మగువలు ధరించిన డ్రెస్‌లు అలాంటివే! వింటర్‌లో జాకెట్‌లు, బాంబర్లు లేదంటే కోట్స్ బాగా ట్రెండీ కదా! అవే కొట్టొచ్చేలా కనిపించేందుకు విభిన్న కలర్ థీమ్‌లు ఎంచుకున్నారు డిజైనర్లు. ఏ మూలనున్నా ఫ్లాష్ అయ్యేలా జిగేల్‌మనే పాప్ కలర్స్... వాటికి బోల్డ్ కట్స్ జోడించి అద్భుతమైన టచ్ ఇస్తున్నారు. అటు స్టయిల్‌కు స్టయిల్... ఇటు ట్రెండ్‌కు ట్రెండూ... అన్నింటికీ మించి స్పెషల్ ఎట్రాక్షన్! అప్పుడప్పుడూ వెండితెర వెలుపల మెరిసే తారలకు ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ చలికాలంలో మీరూ ఓసారి ప్రయత్నించండి.