ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

ABN , First Publish Date - 2022-05-23T06:10:00+05:30 IST

ప్రజా నాయకుడు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికా దని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
తిమ్మాపూర్‌లో మాట్లాడుతున్న అడ్రూలరి లక్ష్మణ్‌కుమార్‌,

డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, మే 22: ప్రజా నాయకుడు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికా దని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని తి మ్మాపూర్‌ గ్రామంలో ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్‌, కాంగ్రెస్‌ కోరుట్ల నియో జకవర్గ ఇన్‌ఛార్జ్‌ జువ్వాడి నర్సింగరావుతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవన్‌రెడ్డి బీజేపీ వారి తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయ్యారని కవిత చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్‌ పా ర్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగి త్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి గెలిచిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సాధించిన ఓట్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో కవిత ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఆనాటి ఎంపీ ఎన్నికల ఫలితాలు బట్టి చూస్తే బీజేపీతో మ్యాచ్‌ ఫిక్స్‌ ఎవరనేది తేలిపోయిందన్నారు. కేంద్రం  పెంచిన పెట్రోల్‌, డి జిల్‌, గ్యాస్‌ ధరలకు నిరసనగా రాస్తారోకో, ధర్నాలు ప్రజల ముందు నిల బడినట్లు ఆయన గుర్తు చేశారు. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించేం దుకు వస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులు చూపించాలని కవిత మా ట్లాడ టం సరికాదన్నారు.  తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌కు వెంట ఉం డి సలహాలు ఇచ్చిన జీవన్‌రెడ్డి గురించి ఒక సారి సీఎం కేసీఆర్‌ను అడి గితే తెలుస్తుందని ఆయన అన్నారు. కవిత మాటలు వెనక్కి తీసుకోవా లని ఆయన విజ్ఞప్తి చేశారు. జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ రచ్చ బండ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళితే కాంగ్రెస్‌ వారికి అభివృద్ధి చూపించాలని మాట్లాడుతున్న కవిత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, దళితు లకు మూడు ఎకరాల భూమి, ఖాళీ స్థలం ఉంటే ఇళ్లు నిర్మించుకుంటే రూ.5 లక్షలు మంజూరు ఎక్కడ ఉందో చూపించాలని అన్నారు. వరి వే స్తే ఉరి అంటూ చెప్పి రైతుల జీవితాలతో చెలగాటం ఆడిన సీఎం కేసీ ఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ఈ సమావే శంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాజేష్‌, మైనార్టీ అధ్యక్షులు ఎండీ రఫియొ ద్దీన్‌, తిమ్మాపూర్‌ ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, మొగిలి, మాజీ ఎంపీటీసీ సీపతి సత్యనారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-23T06:10:00+05:30 IST