కలెక్టరేట్‌ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-08-16T05:51:40+05:30 IST

కలెక్టరేట్‌ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి

కలెక్టరేట్‌ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి

  • మాట్లాడుతున్న కలెక్టర్‌ హరీశ్‌

మేడ్చల్‌, 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టర్‌ భవనాన్ని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే పూర్తిచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ఒక్కో అధికారికి ఒక్కో బాధ్యతను అప్పగించామని, అధికారులు వారి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం పూర్తయి సీఎం తిరిగి వెళ్లే వరకు అధికారులతో పాటు పోలీసులు సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాంసన్‌, లింగ్యానాయక్‌, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య పాల్గొన్నారు. 


  • పెండింగ్‌ పనులన్నీ పూర్తిచేయాలి

మేడ్చల్‌ అర్బన్‌: నూతన కలెక్టరేట్‌ భవనం వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతి న పూర్తిచేయాలని ఇన్‌చార్జి కల్టెక్టర్‌ ఎస్‌.హరీష్‌ అధికారులను ఆదేశించారు. శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని పరిశీలించి సూచనలు చేశారు. కలెక్టరేట్‌ను ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారని, పనులు చకచకా చేయాలన్నారు. వర్షం కురిసినా సభకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.

Updated Date - 2022-08-16T05:51:40+05:30 IST