AP News: అంపాపురంలో వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-09-02T16:14:52+05:30 IST

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లాలోని అంపాపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని కేవీపీ, డాక్టర్ నాగేశ్వరరావు, సుధ దంపతులు ఆవిష్కరణ చేశారు.

AP News: అంపాపురంలో వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరణ

కృష్ణా: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లాలోని అంపాపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని కేవీపీ, డాక్టర్ నాగేశ్వరరావు, సుధ దంపతులు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ.. అంపాపురం గ్రామంలో వైఎస్సార్ కాంస్య విగ్రహం పునఃప్రారంభించామని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ నాగేశ్వరరావు, సుధ  దంపతులు ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సేవ చేస్తున్నారని తెలిపారు. ఈ విగ్రహం ఏర్పాటుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మహా నాయకుడు మనకు‌ దూరమైన రోజు ఈరోజన్నారు. అందరూ ఎంతో ఆవేదనతో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జ్ఞాపకం చేసుకుంటున్నారని అన్నారు. కష్టాలలో ఉన్న కాంగ్రెస్ బాధ్యతలను రఘువీరారెడ్డి భుజాన వేసుకున్నారని, ఆ వారసత్వ కష్టాలను ఇప్పుడు శైలజానాథ్ మోస్తున్నారని తెలిపారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్‌కు సూచనలు చేస్తూ తలలో నాలుకలా ఉండేవారన్నారు. ఏఐసీసీకి, పీసీసీకి వారధిగా ఉండవల్లి వ్యవహరించే వారని అన్నారు. దుట్టా రామచంద్రరావు వైయస్సార్‌కు ఏకలవ్య శిష్యుడని చెప్పారు. ఎంతమంది ఈరోజు ఇక్కడకు వచ్చి వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారని కేవీపీ పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-02T16:14:52+05:30 IST