ఆగని నిరసనలు

ABN , First Publish Date - 2022-09-23T06:49:45+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరును రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ హెల్త్‌ వర్శిటీగా మార్చడం పట్ల గురువారం కూడా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి.

ఆగని నిరసనలు
చంద్రగిరిలో ధర్నా చేస్తున్న టీడీపీ నేతలు

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీ పేరు మార్పుపై పలుచోట్ల ఆందోళనలు 

తిరుపతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరును రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ హెల్త్‌ వర్శిటీగా మార్చడం పట్ల గురువారం కూడా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి.చంద్రగిరి టవర్‌ క్లాక్‌ కూడలిలో గురువారం మధ్యాహ్నం టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ధర్నాకు దిగాయి. నియోజకవర్గవ్యాప్తంగా ఆరు మండలాల నుంచీ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో కూడలి కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ఆరు మండలాల నుంచీ నేతలు, కార్యకర్తలు వందలాదిగా హాజరయ్యారు.తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో తెలుగు యువత, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నేతలు, కార్యకర్తలు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. వర్శిటీ ఆవరణలోని గ్రంధాలయం ఎదుట నిరసనకు దిగిన వీరు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీ పేరు మార్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్‌ గౌడ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్‌, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ తిరుపతి పార్లమెటు అధ్యక్షుడు హేమంత్‌ రాయల్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్‌కే నాయుడు తదితరుతలో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.టీడీపీ శ్రేణులు వెంకటగిరి పట్టణంలో ఆందోళన చేపట్టాయి. పార్టీ కార్యాలయం నుంచీ ఎన్టీఆర్‌ కాలనీలో వరకూ ర్యాలీగా నినాదాలు చేస్తూ వెళ్ళిన కార్యకర్తలు అక్కడి కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం హెల్త్‌ వర్శిటీ పేరు మార్పు జీవో ప్రతులను తగులబెట్టారు. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. అలాగే గూడూరులో సైతం టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో గమళ్ళపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడే జీవో ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌, టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌, ముఖ్యనేత పనబాక కృష్ణయ్య, నియోజకవర్గ పరిశీలకుడు కరీముల్లా తదితరులతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.శ్రీకాళహస్తి పట్టణంలో కూడా ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించాయి. అనంతరం పూలతో విగ్రహం ఎదుట ఎన్టీఆర్‌ అన్న అక్షరాలను రూపొందించి తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ తదితరులు నిరసన వ్యక్తం చేశారు.శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో నరసింహ యాదవ్‌, తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష, రాష్ట్ర కార్యదర్శులు చలపతి నాయుడు,గురవారెడ్డి, పట్టణాధ్యక్షుడు విజయ్‌కుమార్‌ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిర్ణయంపై ధ్వజమెత్తారు. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, నాయుడుపేటలో మాజీ మంత్రి పరసా రత్నం మీడియాతో మాట్లాడుతూ హెల్త్‌ వర్శిటీ పేరు మార్చడం దుర్మార్గమన్నారు. కాగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన సినీ నిర్మాత అంబికా కృష్ణ సైతం హెల్త్‌ వర్శిటీ పేరు ఎందుకు మార్చారో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-09-23T06:49:45+05:30 IST