ఆదాయం ఢమాల్‌

ABN , First Publish Date - 2021-04-19T04:37:38+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి.. లాక్‌డౌన్‌.. భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ శాఖకు అప్పగించడం లాంటి కారణాలేవైనా, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదా యం అమాంతం పడిపోయింది.

ఆదాయం ఢమాల్‌
వనపర్తి జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

- తగ్గిన రిజిస్ట్రేషన్ల రాబడి 

- వనపర్తి జిల్లాలో 50 శాతానికి పడిపోయిన ఆదాయం


వనపర్తి (రాజీవ్‌ చౌరస్తా), ఏప్రిల్‌ 18 : కరోనా వైరస్‌ వ్యాప్తి.. లాక్‌డౌన్‌.. భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ శాఖకు అప్పగించడం లాంటి కారణాలేవైనా, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదా యం అమాంతం పడిపోయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ప్రభుత్వానికి అత్యధికంగా అదాయం తెచ్చి పెట్టిన రికార్డు ఉన్న వనపర్తి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఆదాయం నేడు సగానికి సగం తగ్గిపోయింది. ప్రభుత్వం పెట్టిన టార్గెట్‌ అందుకోవడంలో 50 శాతం దగ్గరే నిలిచిపోయింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ఈ రిజిస్ట్రేన్‌ శాఖ నుంచి రూ.30 కోట్లకు పైగా ఆదాయం ఆ శించిన ప్రభుత్వం, రూ.12 కోట్లతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇ న్నాళ్ల రిజిస్ట్రేషన్‌ శాఖ రికార్డులో వనపర్తి ఆదాయం ఇంత తగ్గడం, ఇదే మొదటి సారి.


సగానికి పడిపోయిన డాక్యుమెంట్లు

వనపర్తి ప్రాంతంలో విద్యా, వ్యాపార సంస్థలు సంపూర్ణంగా అభివృద్ధి చెందడం వల్ల చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు, సగటు జీవులు ఇ క్కడే ఇల్లు కట్టుకొని స్థిరపడడానికి ఆసక్తి చూపుతారు. దీని వల్ల పదేళ్లుగా వనపర్తి ప్రాంతంలో స్థిరాస్తులు కొనడం, అమ్మడం వంటివి ఎక్కువయ్యా యి. అయితే, గత ఏడాది కరోనా విజృంభించడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ వి ధించడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నెలల పాటు రియల్‌ వ్యా పారం స్తంబించిపోయింది. దీంతో స్థిరాస్తుల క్రయ, విక్రయాలు నిలిచిపోయి, డాక్యుమెంట్లు రాకపోవడంతో రిజిస్ట్రే షన్‌ కార్యాలయం వెలవెలపోయేది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అ నంతరం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ధరణి పోర్టల్‌ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం దాదాపు నాలుగు నెలల పాటు అన్ని రకాల రిజిస్ట్రేష న్లను నిలిపివేసింది. ఈ క్రమంలోనే భూముల రిజిస్ట్రేషన్లను రెవెన్యూ శాఖ ద్వా రా చేపట్టాలని ఆయా మండలాల తహసీల్దార్లకు ఈ విధులను అప్పగించారు. దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి కేవలం ప్లాట్లు, ఇళ్లకు సంబంధించిన డా క్యుమెంట్లు మాత్రమే వస్తుండడంతో ఆదాయం తగ్గిపోయింది.


ఈ ఏడాది ఆదాయం రూ. 12 కోట్లే..

దశాబ్ద కాలంలో వనపర్తి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి వ చ్చే ఆదాయం అతి తక్కువగా రావడం ఇదే మొదటి సారి. 2019-20లో వనప ర్తి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మొత్తం 27,450 డాక్యుమెంట్ల ద్వారా రూ.20 కోట్ల 15 లక్షల 64 వేల ఆదాయం సమకూరగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో  15, 897 డాక్యుమెంట్లు మాత్రమే రావడంతో ఆదాయం రూ.12 కోట్ల 92 లక్షల 77 వేలు మాత్రమే వచ్చింది. ఈ లెక్కన చూస్తే దాదాపు సగం ఆదాయం పడి పోయినట్లుగా తెలుస్తోంది. అదే వనపర్తి జిల్లాగా ఏర్పడకముందు 2015-16లో ఏకంగా రూ.25 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. దీన్ని బట్టి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయిందని తెలుస్తోంది. అయితే, వి విధ కారణాలతో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం తగ్గిపోయిందని, ఇటీవ ల రియల్‌ వ్యాపారం పుంజుకోవడంతో పరిస్థితి కొంత మెరుగైందని సబ్‌ రిజిస్ట్రార్‌ ఖుర్షియా బదర్‌ తెలిపారు.

Updated Date - 2021-04-19T04:37:38+05:30 IST