ఆదాయం ఆవిరి

ABN , First Publish Date - 2020-08-09T08:48:19+05:30 IST

రోనా వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల ఆదాయంపై ప్రభావం చూపుతోందని స్టాండర్డ్‌ చార్టర్డ్‌ తాజా అధ్యయన నివేదిక పేర్కొంది. భారతీయుల్లో మూడింట ఒక వంతు (32 శాతం) మంది ఆదాయం..

ఆదాయం ఆవిరి

  • కరోనా కాలంలో 32% భారతీయుల రాబడి తగ్గింది: స్టాన్‌ చార్ట్‌


కరోనా వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల ఆదాయంపై ప్రభావం చూపుతోందని స్టాండర్డ్‌ చార్టర్డ్‌ తాజా అధ్యయన నివేదిక పేర్కొంది. భారతీయుల్లో మూడింట ఒక వంతు (32 శాతం) మంది ఆదాయం.. కరోనా పూర్వ స్థాయి కంటే తగ్గిందని రిపోర్టు వెల్లడించింది. ఈ మహమ్మారి తమ ఆదాయం లేదా ఉద్యోగంపై మున్ముందు మరింత ప్రభావం చూపనుంద ని సగానికి పైగా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. భారత్‌ సహా 12 దేశాలకు చెందిన 12,000 మందిని స్టాన్‌ చార్ట్‌ సర్వే చేసింది. ఈ సవాళ్ల సమయంలో వారి ఆదాయ స్థితిగతులు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన వివరాలు సేకరించింది.  సర్వేలో పాల్గొన్న వారి ప్రస్తుత  ఆర్థిక పరిస్థితి, భవిష్యత్‌పై వారి ధీమాకి మధ్య పూర్తి వైవిధ్యం కన్పించిందని స్టాన్‌ చార్ట్‌ తెలిపింది. ముఖ్యంగా, భారత్‌ వంటి వర్ధమాన దేశాల్లోని యువకులు భవిష్యత్‌పై అత్యంత ఆశావహంగా ఉన్నారంటోంది. అవసరమైతే మరింత కష్టపడటంతోపాటు ఆదాయాన్ని గాడినపెట్టేందుకు చర్యలు చేపట్టడం, నైపుణ్యతను పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వీరు తెలిపినట్లు రిపోర్టు పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు.. 


  1. కరోనా గండం ముగిసిన తర్వాత సఫలమయ్యేందుకు అవసరమైన డిజిటల్‌ నైపుణ్యాలు కలిగి ఉన్నామని ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంది (18-34 ఏళ్లవారు) ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లో ఈ వాటా 89 శాతంగా ఉంది.
  2. 25-34 ఏళ్ల వయసున్న భారతీయుల్లో రెండో ఆదాయ మార్గాన్ని ఏర్పరుచుకుంటామన్న వారు 76 శాతం. 55 ఏళ్ల పైబడిన వారిలో ఈ వాటా 67 శాతం. 
  3. వచ్చే 6 నెలల్లో కొత్త వ్యాపారం ప్రారంభించే యోచనలో ఉన్న భారతీయులు (18-44 ఏళ్ల వారు) 56 శాతం. 45 ఏళ్లు పైబడిన వారిలో ఈ వాటా 45 శాతంగా ఉంది.  
  4. భారత్‌తో పాటు కెన్యా, మెయిన్‌లాండ్‌ చైనా, పాకిస్థాన్‌కు చెందిన 88 శాతం మంది ఆదాయం పెంచుకునేందుకు మరింత సమయం పని చేస్తామన్నారు. 
  5. ఆంక్షలు ఎత్తివేశాక కూడా వారానికి కనీసం రెండ్రోజులు ఇంటి నుంచే పనిచేసే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) సౌలభ్యం కోరుకుంటున్న భారతీయ ఉద్యోగులు 83 శాతం. ప్రపంచవ్యాప్తంగా వీరి వాటా 71 శాతం. భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 77 శాతం ఉద్యోగులు భవిష్యత్‌లో సౌకర్యవంతమైన పని ఏర్పాట్లను కోరుకుంటున్నారు.

Updated Date - 2020-08-09T08:48:19+05:30 IST