BJP ఈవెంట్‌కు Rahul Dravid అంటూ రిపోర్టులు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా కోచ్

ABN , First Publish Date - 2022-05-11T02:06:55+05:30 IST

న్యూఢిల్లీ : బీజేపీ మీటింగ్‌కు హాజరుకాబోతున్నానంటూ వస్తున్న మీడియా రిపోర్టులను భారత క్రికెట్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తోసిపుచ్చాడు. ఈ వార్తల్లో నిజం లేదని తేల్చాచెప్పారు.

BJP ఈవెంట్‌కు Rahul Dravid అంటూ రిపోర్టులు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా కోచ్

న్యూఢిల్లీ : బీజేపీ ఈవెంట్‌లో తాను పాల్గొనబోతున్నానంటూ వస్తున్న మీడియా రిపోర్టులను భారత క్రికెట్ హెడ్ కోచ్  రాహుల్ ద్రావిడ్  తోసిపుచ్చాడు. ఈ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పాడు. ‘‘ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో మే 12 -15 తేదీల మధ్య జరగబోతున్న బీజేపీ యువ మోర్చా జాతీయ వర్కింగ్ కమిటీ సెషన్‌లో నేను పాల్గొనబోతున్నట్టు ఓ సెక్షన్ మీడియాలో రిపోర్టులు వస్తున్నాయి. ఇది నిజంకాదని నేను స్పష్టం చేయదలచుకున్నాను’’ అని ద్రావిడ్ మంగళవారం ప్రకటించాడు. దీంతో ఈ ప్రచారానికి ముగింపుపడింది.


కాగా రాహుల్ ద్రావిడ్ బీజేపీ మీటింగ్‌లో పాల్గొనబోతున్నారంటూ బీజేపీ ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా తొలుత ప్రకటించారు. యువత వేర్వేరు రంగాల్లో రాణించొచ్చనే సందేశం రాహుల్ ద్రావిడ్ ద్వారా చేరుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కానీ ఇదంతా ప్రచారమేనని తేలిపోయింది. కాగా ధర్మశాలలో మే 12 - 15 మధ్య జరగబోయే బీజేపీ యువ మోర్చా మీటింగ్‌లో బీజేపీ జాతీయ నాయకత్వంతోపాటు హిమాచల్ ప్రదేశ్ కేడర్ పాల్గొననుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more