బస్సు చార్జీల పెంపు సరికాదు

ABN , First Publish Date - 2022-07-02T06:41:53+05:30 IST

ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం సరికాదని నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు.

బస్సు చార్జీల పెంపు సరికాదు
మాట్లాడుతున్న గౌరు దంపతులు

 గౌరు దంపతులు

కల్లూరు, జూలై 1: ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం సరికాదని నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు. శుక్రవారం నగరంలోని గౌరు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సామాన్యులను అతి తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు చేరవేర్చే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి ప్రజలపై రూ.1,500 కోట్ల మేర భారం మోపడం సరైంది కాదన్నారు. మొదటి సారీ చార్జీలు పెంచి రూ.675 కోట్లు, రెండోసారి రూ.1,500 కోట్లు చార్జీలు పెంచి మొత్తం ఆర్టీసీ పైన రూ.2,175 కోట్ల భారాన్ని సామాన్యులపై మోపారన్నారు. ప్రతిపక్ష హోదాలోఉన్నప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న హామీ ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఆర్టీసీ సంస్థను కాకుండా ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుని గతంలో ఉద్యోగులకు వచ్చే సదుపాయాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపో పరిధిలోని ఖాళీ స్థలంలో జీవోటి ప్రతిపాదికన 33 సంవత్సరాలు లీజుకు ఇచ్చే పేరుతో భూములను కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నందికొట్కూరు మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ గుండం రమణారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ యాదవ్‌, అశోక్‌ కుమార్‌ రెడ్డి నాయకులు పాల్గొన్నారు.

పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలి: డీవైఎఫ్‌ఐ

కర్నూలు(రూరల్‌):
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డీవైఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి నగేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం కొత్తబస్టాండ్‌ ఎదుట డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు బస్సు చార్జీలను పెంచడం దారుణమన్నారు. తద్వారా జిల్లా ప్రజలపై మరింత భారాన్ని మోపడం సరికాదన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు, నిత్యావసర ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందని వారు ఆరోపించారు. కార్యక్రమంలో డీవైఎ్‌ఫఐ నాయకులు హుస్సేన్‌బాషా, శంకర్‌, శిరీష, ధను, ప్రకాష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-07-02T06:41:53+05:30 IST