ఆర్టీసీ చార్జీల పెంపు తగదు

ABN , First Publish Date - 2022-07-02T05:21:58+05:30 IST

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు తగదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం తన నివాసంలో విలేఖర్లతో మాట్లాడారు. రెండున్నర నెలల వ్యవధిలోనే సెస్‌ పేరిట అమాంతం చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.

ఆర్టీసీ చార్జీల పెంపు తగదు
మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి 

సాలూరు, జూలై 1: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు తగదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం తన నివాసంలో విలేఖర్లతో మాట్లాడారు. రెండున్నర నెలల వ్యవధిలోనే సెస్‌ పేరిట అమాంతం చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుతో సామాన్య, మధ్యతరగతి వారు బస్సు ఎక్కాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రజలు ప్రయాణించే ‘పల్లె వెలుగు’ బస్సులు మొదలుకొని అన్నింటిపైనా అదనంగా వడ్డించారన్నారు. డీజిల్‌ సెస్‌ బాదుతూనే... ప్రయాణికులపై భారం వేయడంలేదని ప్రభుత్వం వింత ప్రకటన చేయడం గమనార్హమని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ‘బాదుడే బాదుడు’ కొనసాగిస్తోందన్నారు. ఓ వైపు నిత్యావసరాల ధరలు రోజురోజుకూ నింగినంటుతుండగా, మరోవైపు బస్‌ చార్జీలు పెంచడం భావ్యం కాదన్నారు. ధరలను అదుపు చేయాల్సిన సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. వివిధ నిబంధనలతో ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆ సంస్థలో ఉన్న స్థలాలాపై కన్నేసిందని ఆరోపించారు. వాటిని సైతం లీజుకు ఇచ్చే పనిలో సర్కారు ఉందన్నారు. ఏదేమైనా ఆర్టీసీ బస్సుల చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. 


Updated Date - 2022-07-02T05:21:58+05:30 IST