గుప్పెడు ఎండుద్రాక్ష నోట్లో వేసుకుని ఇలా చేశారంటే..

ABN , First Publish Date - 2021-11-03T18:54:15+05:30 IST

శరీర అవసరాలకు తగిన ఆహారం ఎంచుకోవాలి. తక్షణ శక్తి, కండర నిర్మాణం, మెటబాలిజం, కొవ్వును కరిగించడం... ఇలా ఆ సమయాల్లో ఎంచుకోదగిన పవర్‌ ఫుడ్స్‌ ఇవే!

గుప్పెడు ఎండుద్రాక్ష నోట్లో వేసుకుని ఇలా చేశారంటే..

ఆంధ్రజ్యోతి(03-11-2021)

శరీర అవసరాలకు తగిన ఆహారం ఎంచుకోవాలి. తక్షణ శక్తి, కండర నిర్మాణం, మెటబాలిజం, కొవ్వును కరిగించడం... ఇలా ఆ సమయాల్లో ఎంచుకోదగిన పవర్‌ ఫుడ్స్‌ ఇవే!


శక్తి కోసం: శక్తి నిల్వలు తరగకుండా ఉండాలంటే ఓట్లు తినాలి. దీర్ఘ సమయం పాటు వ్యాయామం చేయాలనుకుంటే సహజసిద్ధంగా శక్తిని పెంచే గుప్పెడు ఎండుద్రాక్ష నోట్లో వేసుకోవాలి. వ్యాయామంతో నీరసించిపోకుండా ఉండాలంటే శరీరంలో ఎలకొ్ట్రలైట్లను భర్తీ చేసే అరటి పండు తినాలి.


నొప్పి వదిలేలా: కండరాల నొప్పులను 20 శాతానికి తగ్గించే గుణం అల్లానికి ఉంటుంది. తల తిరుగుడును కూడా తగ్గించే అల్లంతో టీ తయారుచేసుకుని తాగాలి. చెర్రీ పళ్లకు ఫ్రీ ర్యాడికల్స్‌ను స్థిరీకరించి త్వరగా కోలుకునేలా చేసే గుణాలుంటాయి. కీళ్లనొప్పులకు ఇబ్యుప్రొఫెన్‌లా పని చేసే పసుపును ఆహారంలో చేర్చుకుంటే నొప్పులు తగ్గుతాయి.


కండర నిర్మాణం: గుడ్లలోని అమీనో యాసిడ్లు, ల్యూసిన్‌ కండరాలను చురుగ్గా మరమ్మతు చేస్తాయి. బిగుతైన యాబ్స్‌ నిర్మాణంలో ప్రథానమైన పాత్ర పోషించే వే ప్రొటీన్‌ తీసుకోవచ్చు. చేపల్లోని మాంసకృత్తులు కండరాలు బలపడే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.


మెటబాలిజం: పిస్తా... వ్యాయామం తర్వాత అనవసరపు క్యాలరీలు దరి చేరకుండా ఆకలిని తీర్చే పవర్‌ ఫుడ్‌. వ్యాయామం చేసే సమయంలో తక్కువ శక్తితో ఎక్కువ ప్రయోజనం దక్కేలా చేయగలిగే కూరగాయ బీట్‌రూట్‌. సోయాబీన్స్‌ కొవ్వును వేగంగా కరిగిస్తాయి. కాబట్టి లావు తగ్గాలనుకునేవాళ్లు పిస్తా, బీట్‌రూట్‌, సోయాలను ఆహారంలో చేర్చుకోవాలి.

Updated Date - 2021-11-03T18:54:15+05:30 IST