ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచండి

ABN , First Publish Date - 2021-05-09T05:13:18+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో రోగులకు ప్రాణాలను నిలిపేందుకు అవసరమైన లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్టీల్‌ప్లాంట్‌ అధికారులను ఆదేశించారు.

ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచండి
ప్లాంట్‌ను పరిశీలిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు

స్టీల్‌ప్లాంట్‌కు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు

విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ నేపథ్యంలో రోగులకు ప్రాణాలను నిలిపేందుకు అవసరమైన లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్టీల్‌ప్లాంట్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన నేరుగా స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లి సీఎండీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతున్న తీరుతోపాటు ఇంకా పెంచేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు. శనివారం ఉదయం మరోసారి స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లి ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను పరిశీలించారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 130 టన్నులకు మించి డిమాండ్‌ ఉన్నందున అదనంగా ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌లో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్‌ సదుపాయం గల వెయ్యి పడకల ఆస్పత్రిని పరిశీలించారు.  ఆయన వెంట జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్‌ రాజారత్నం పాల్గొన్నారు.


Updated Date - 2021-05-09T05:13:18+05:30 IST