సార్వా..విత్తన భారం

ABN , First Publish Date - 2021-06-17T05:04:21+05:30 IST

సార్వా విత్తన ధర పెరిగింది.

సార్వా..విత్తన భారం

భీమవరం రూరల్‌, జూన్‌ 16 : సార్వా విత్తన ధర పెరిగింది. 75 కేజీల బస్తా రూ.2,000 నుంచి రూ.2,100 వరకు పలుకుతోంది. నాణ్యమైన విత్తనం కోసం ఎంత ధర అయినా వెచ్చించి కొనుగోలుకు రైతులు మక్కువ చూపుతున్నారు. తొలకరి పలకరింపుతో వాతావరణం అనుకూలంగా మారింది. నాలుగు రోజుల నుంచి సార్వా నారుమడుల ఏర్పాట్లకు డెల్టా రైతులు సిద్ధమయ్యారు. సార్వాలో ప్రధానంగా సాగు చేసే 1121, 1061, 1064, స్వర్ణ, సంపత్‌ రకాల విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది విత్తనాల బస్తా రూ.1700 లోపు ధర ఉండేది. ఈసారి విత్తన సాగు రైతులు ధర పెంచడం, విత్తన సాగు తక్కువ చేయడంతో గిరాకీ పెరిగింది. దీంతో 75 కిలోల బస్తాకు రూ.300 పైనే ధరలో తేడా కనిపిస్తోంది. ఎప్పుడూ దాళ్వా విత్తనానికి గిరాకీ ఉండేది. ఈ సారి సార్వా విత్తన ధర పెరగడం సాగు ఆదిలోనే రైతులపై భారం పడింది. ప్రభుత్వం విత్తనాలను అందుబాటులోకి తెచ్చినా రైతు విత్తనాలపైనే మక్కువ చూపడం ఈ ధరలో వ్యత్యాసం కనిపిస్తోంది.

Updated Date - 2021-06-17T05:04:21+05:30 IST