జలవిద్యుత్‌ కేంద్రాలకు ఉత్పత్తి లక్ష్యాలు పెంపు

ABN , First Publish Date - 2021-04-19T05:14:32+05:30 IST

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని నాలుగు జలవిద్యుత్‌ కేంద్రాలకు 2021 - 2022 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర విద్యుత్‌ అఽథారిటీ (సీఈఏ) అధికారులు 2316.140 మిలియన్‌ యూనిట్ల విద్యు దుత్పత్తి లక్ష్యంగా నిర్ణయించారని జెన్‌కో సీఈ ఎం.గౌరీపతి తెలిపారు.

జలవిద్యుత్‌ కేంద్రాలకు ఉత్పత్తి లక్ష్యాలు పెంపు
జెన్‌కో సీఈ ఎం.గౌరీపతి

 2021 -22కి 2316.140 మిలియన్‌ యూనిట్ల్ల ఉత్పత్తి  టార్గెట్‌ 

జెన్‌కో సీఈ ఎం.గౌరీపతి 

సీలేరు, ఏప్రిల్‌ 18: సీలేరు కాంప్లెక్సు పరిధిలోని నాలుగు జలవిద్యుత్‌ కేంద్రాలకు 2021 - 2022 ఆర్థిక సంవత్సరానికి  కేంద్ర విద్యుత్‌ అఽథారిటీ (సీఈఏ) అధికారులు  2316.140 మిలియన్‌ యూనిట్ల విద్యు దుత్పత్తి లక్ష్యంగా నిర్ణయించారని జెన్‌కో సీఈ ఎం.గౌరీపతి తెలిపారు. ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జలవిద్యు త్‌ కేంద్రాలకు గత ఏడాది కంటే ఈ ఏడాది  242 మిలియన్‌ యూనిట్ల ఎక్కువ టార్గెట్‌ ఇచ్చారన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2074.98 మిలియన్‌ యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, లక్ష్యాన్ని రెండు నెలలు ముందుగానే సాధించామని, మార్చి 31కి 630 యూనిట్లు అధికంగా ఉత్పత్తిని సాధించామని సీఈ తెలిపారు. మాచ్‌ఖండ్‌, ఎగువ సీలేరు, డొంకరాయి, పొల్లూరు (లోయర్‌ సీలేరు) నాలుగు జలవిద్యుత్‌ కేంద్రాలు వస్తాయని, వీటిలో మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో 114.75 మెగావాట్ల సామర్థ్యం ఉండగా 612 మిలియన్‌ యూనిట్లు ఈ ఏడాది లక్ష్యంగా నిర్ణయించారన్నారు. ఎగువ సీలేరు 240 మెగావాట్లు సామ ర్థ్యం కాగా,   472 మిలియన్‌ యూనిట్లు, డొంకరాయి మినీ జలవిద్యుత్‌ కేంద్రం 25 మెగావాట్ల సామర్థ్యం కాగా, 102.140 మిలియన్‌ యూనిట్లు, పొల్లూరు (లోయర్‌ సీలేరు)లో 460 మెగావాట్ల సామర్థ్యానికి 1130 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తిని చేయాలని ల క్ష్యం నిర్దేశించారన్నారు. ప్రస్తుతానికి ఆయా జలవిద్యు త్‌ కేంద్రాలకు వేసవిలో నీటి సమస్య లేదని, గ్రిడ్‌ అధికారుల ఆదేశాల మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నామన్నారు. 

  


Updated Date - 2021-04-19T05:14:32+05:30 IST