జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలి

ABN , First Publish Date - 2022-06-29T07:03:45+05:30 IST

జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తీర్ణంను పెం చేందుకు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ గుగులోతు రవి అధి కారులను ఆదేశించారు.

జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలి
ఆయిల్‌ ఫామ్‌ సాగును పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి

 కలెక్టర్‌ రవి

గొల్లపల్లి, జూన్‌ 28 : జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తీర్ణంను పెం చేందుకు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ గుగులోతు రవి అధి కారులను ఆదేశించారు. గొల్లపల్లి మండలం అబ్బాపూర్‌ గ్రామంలో ఉద్యా నవన, పట్టుపరిశ్రమ శాఖల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఆయిల్‌ పామ్‌ నర్సరి కేంద్రాన్ని సందర్శించారు. ఆయిల్‌ పామ్‌ సాగుపై ఉద్యానవన, పట్టుపరిశ్రమ, ఆటవీ, వ్యవసాయ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీ క్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ సాగు పట్ల రైతులకు పూర్తి స్థాయిలో అవగా హన కల్పించి సాగు విస్తీర్ణంను పెంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలమైన నేలలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారని, అందులో భాగంగా గోల్డ్‌ డ్రాప్‌ ఆయిల్‌కు చెందిన లోహియ ఎడిబుల్‌ ఆయిల్‌ ప్రై. లి. సంస్థకు ఆయిల్‌ పామ్‌ సాగు బాధ్యతను ప్రభుత్వం అప్పగించిందన్నారు. గొల్లపల్లి మం డలం అబ్బాపూర్‌ గ్రామంలో 50 ఎకరాల సువిశాల స్థలంలో ఆయిల్‌ పా మ్‌ సాగు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. 10450 మొక్కలను పెంచు తున్నట్లు పేర్కోన్నారు.  ఈ సమావేశంలో జిల్లా ఉద్యావన శాఖ అధికారి ప్రతాప్‌ సింగ్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి. సురేష్‌, పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T07:03:45+05:30 IST