పెరిగిన భూగర్భ జలాలు

ABN , First Publish Date - 2020-10-03T09:59:01+05:30 IST

జిల్లాలో భూ గర్భ జలాలు ప్రతీఏటా పాతాళంలోనే ఉండేవి.

పెరిగిన భూగర్భ జలాలు

జిల్లాలో అమాంతంగా పెరిగిన భూగర్భజలాలు

సరాసరి మట్టం 9.30 మీటర్లలోనే..

బిచ్కుంద మండలం పుల్కల్‌లో 1.72 మీటర్లలోనే భూగర్భజలాలు

దోమకొండలో మెరుగైన నీటి నిల్వలు

తాగు, సాగునీటికి ఢోకా లేదంటున్న అధికారులు

సాధారణం కంటే 23 శాతం ఎక్కువే నమోదైన వర్షపాతం

జుక్కల్‌లో 2,221 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు


కామారెడ్డి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూ గర్భ జలాలు ప్రతీఏటా పాతాళంలోనే ఉండేవి. వర్షాకాల సమ యంలో కాస్తామెరుగుపడినప్పటికీ భూ గర్భజలాలు అలా పెరిగి ఇలా పడిపోతుండేవి. వేసవి వచ్చిందంటే జిల్లా అంతటా, సాగు, తాగునీటికి కటకట ఏర్పడేది. కానీ జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం భూ గర్భ జాలలు అమాంతంగా పెరిగిపోయాయి. పాతాళంలో ఉండే నీరు ఎప్పుడేప్పుడా అని పైకి వచ్చేందుకు ఉరకలేస్తోంది. జిల్లా లోని కొన్ని ప్రాంతాల్లో పంపు మోటార్లలో, ఊటబావుల్లో నీరు ఉబికి వస్తున్నాయి.


ఈ యేడు వర్షాకాలంలో ఏకధాటిగా వర్షాలు కురువడంతోనే పాతాళగంగా పైపైకి ఉరకళెత్తు తోందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా భూ గర్భజలాల మట్టం ప్రస్తుతం 9.30 మీటర్లలోనే ఉంది. బిచ్కుంద మండలం పుల్కల్‌లో 1.72 మీటర్ల లోతులోనే నిక్షిప్తమై ఉన్నాయి. దోమకొండ, భిక్కనూర్‌ లాంటి మండలాల్లో నూ 10 మీటర్ల లోపే ఉండడం గమనార్హం. సాధారణం కంటే 23 శాతం ఎక్కువ వర్షపాతం నమోదుకావడంతో ప్రాజెక్ట్‌లు, చెరువులు, కుంటలు, వాగులు జలకళను సంతరించుకోవడంతో భూ గర్భజలాల పెంపునకు దోహదపడింది. దీంతో వచ్చే యాసంగిలో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


జిల్లాలో సాధారణం కంటే 

ఎక్కువే వర్షపాతం నమోదు

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో ఆశించిన మేరనే వరణు డు కరుణించి విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే 23 శాతం ఎక్కువే వర్షాపాతం నమోదయి ంది. ఈ సంవత్సరం జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు  సాధార ణ వర్షపాతం 1040 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండ గా 1128.6 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా జుక్క ల్‌ మండలంలో 2,221.8 మి.మీల వర్షం కురిసింది. తక్కువగా సదాశివనగర్‌లో 896.4 మి.మీ వర్షపాతం నమోదయింది. గాంధారిలో 932.4, నిజాంసాగర్‌లో 916.8, లింగంపేటలో 1025.6, ఎల్లారెడ్డిలో 1121.6, పిట్లంలో 996.4, బాన్సువాడలో 1182, కామారెడ్డిలో 963.1, బీర్కూర్‌లో 1087.6, మాచారెడ్డిలో 923.2, తాడ్వాయిలో 1058.6, నాగిరెడ్డిపేటలో 1251.0, దోమకొండలో 973.2, మద్నూర్‌లో 1029.6, భిక్కనూర్‌లో 1238.4, బిచ్కుందలో 1369.4 మి.మీల వర్షపాతం నమోదయి ంది. పది మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా 7 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోద యింది.


చెరువులకు జలకళ

జిల్లావ్యాప్తంగా భారీగా వర్షాలు కురువడంతో ప్రాజెక్ట్‌లు, చెరువులు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ గత 6 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవ త్సరం ఆశాజనకంగానే వరదవచ్చి చేరింది. ప్రాజెక్ట్‌లో ప్రస్తు తం 9.130 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌లోకి 2వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో నీటి నిల్వ 10 టీఎం సీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక కౌలాస్‌నాల ప్రాజెక్ట్‌ పూర్తిగా నిండుకోవడంతో గేట్లు ఎత్తి దిగువ ప్రాంతా నికి నీటిని వదులుతున్నారు. పోచారం ప్రాజెక్ట్‌, సింగీతం, కళ్యాణి రిజర్వాయర్‌లు అలుగు పారుతున్నాయి. జిల్లాలోని 407చెరువులు అలుగులు దూకాయి. 827 చెరువులు వందశా తం నిండుకున్నాయి. 437 చెరువులు 70శాతం నిండుకోగా 253 చెరువులు 50 శాతం నిండుకున్నాయి. ప్రధానవాగులు, వం కలు నీటి ప్రవాహంతో కళకళలాడుతున్నాయి.


అమాంతంగా పెరిగిన భూ గర్భజలాలు

జిల్లాలో జూన్‌ నుంచి సెప్టెంబరు చివరి వరకు ఏకధాటిగా విస్తారంగా వర్షాలు పడడంతో ప్రాజెక్ట్‌ చెరువులు, వాగులు, వంకలు నీటి కుండల్లా మారాయి. అదేవిధంగా 23 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో నీరు ఇంకుడు శాతం పెరిగింది. దీంతో జిల్లాలో భూ గర్భజలాలు అమాం తంగా పెరిగిపోయాయి. జిల్లా సరాసరి నీటిమట్టం 20 మీట ర్లలో ఉండేది. కానీ ఈ సీజన్‌లో భారీ వర్షాల కారణంగా 9.37 మీటర్లలోనే భూ గర్భజలాలు ఎగబాకాయి. జూన్‌లో 14.33 మీటర్లలో ఉండగా జూలైలో 13.94 మీటర్లలో, ఆగస్టులో 11.50, సెప్టెంబరు 20వ తేదీ నాటికి 9.37 మీట్లరలోకి చేరా యి. రెండు నెలల వ్యవధిలోనే రెండు మీటర్లలోకి భూగర్భ జలాలు పెరిగాయి. గత ఏడాది సెప్టెంబరులో భూగర్భ జలాలు 12.24 మీటర్లలోతులో ఉండేవి.


కానీ ఈ ఏడాది 9.37 మీటర్లలోనే ఉండడం గమనార్హం. జిల్లాలోని బిచ్కుంద మండలం పుల్కల్‌లో 2.87 మీటర్లలోనే భూగర్భ జలాలు ఉన్నాయి. ప్రతీ ఏటా భిక్కనూరు, దోమకొండ, మద్నూర్‌ లాంటి మండలాల్లో 30 మీటర్లలోతులో ఉండే పాతాళగంగ ఈ సీజన్‌లో పైకి వచ్చేసింది. దోమకొండలో 16 మీటర్లలోనే భూగర్భజలాలు ఉండడం విశేషం. భూగర్భజలాలు అమాంత ంగా పెరగడంతో మోటారు బోర్ల ప్రవాహం తీవ్రంగా ఉంటు ంది. కొన్నిచోట్ల నీరు ఉబికి వస్తుందని రైతులు పేర్కొంటు న్నారు.


తాగు, సాగు నీటికి ఢోకా లేనట్టే..

భూగర్భజలాలు పెరగడం, ప్రాజెక్ట్‌లు చెరువులు నిండుకు ండల్లా ఉండడంతో మరో ఏడాది పాటు తాగు, సాగునీటికి ఢోకా ఉండదని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నా రు. జిల్లాలో అన్నదాతలు ఎక్కువగా మోటారు బోర్‌లు ఊట బావులు, ప్రాజెక్ట్‌లు, చెరువుల ఆధారంగానే లక్షల ఎకరాలలో పంటలను సాగు చేస్తుంటారు. ప్రధానంగా జిల్లాలో వరి పంటను రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. ఈ పంటకు నీటిలభ్యత చాలా అవసరం. ప్రతీ యాసంగి సీజన్‌లో సమ యానికి సాగునీరు అందక పంటలు ఎండిపోవడంతో రైతు లు నష్టపోవాల్సి వచ్చేది. కానీ ఈ ఏడాది భూ గర్భజలాలు అమాంతంగా పెరగడం, నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌, సింగీతం, కల్యాణి లాంటి ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్‌ల లాంటి చెరువులు నిండుకోవడంతో యాసంగిలో సాగునీటికి కష్టాలు ఉండకపోవచ్చని రైతులు చెబుతున్నారు. అదేవిధంగా తాగు నీటికి సైతం ఎలాంటి ఇబ్బందులు ఉండవని భూగర్భజలాల శాఖ అధికారులు చెబుతున్నారు.


రికార్డుస్థాయిలో భూగర్భ జలాలు.. శ్రీనివాస్‌బాబు, జిల్లా భూగర్భజల శాఖ అధికారి.

జిల్లాలో ఈ యేడు రికార్డు స్థాయిలోనే భూగర్భజాలాలు పెరిగాయి. 23శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కావడం తో నీటి శాతం పెరిగింది. దీంతో భూగర్భజలాల పెంపునకు దోహదపడింది. గత ఏడాదితో పోలిస్తే ఆశాజనకంగానే భూగర్భజలాలు పెరిగాయి. ప్రస్తుతం జిల్లా సరాసరి నీటి మట్టం 9.37 మీటర్లలో ఉన్నాయి. వచ్చే యాసంగిలో మో టారు బోర్‌లు, ఊట బావులు, చెరువుల కింద విస్తారంగా నే రైతులు పంటలు సాగు చేసుకోవచ్చు. తాగునీటికి సైతం కష్టాలు తీరనున్నాయి.

Updated Date - 2020-10-03T09:59:01+05:30 IST