Advertisement

పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలి..

Jul 5 2020 @ 05:08AM

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు


కరీంనగర్‌ టౌన్‌: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోలకు, తహసీల్దార్లకు వినతిపత్రాలను అందజేశారు. కరీంనగర్‌లో సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. 


కరీంనగర్‌ రూరల్‌: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని టిపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఏఐసీసీ పిలుపుమేరకు రాష్ట్రపతికి మెమోరండంను కొత్తపల్లి తహసీల్దార్‌ ద్వారా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా పరిస్థితు లతో దేశం అతలాకుతలం అవుతుంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 లక్షల కోట్లరూపాయలు పెట్రోల్‌ ధరల పెంపు ద్వారా దోచుకున్నారన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని అన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement