పెరిగిన తుడా పరిధి

ABN , First Publish Date - 2022-09-23T06:46:21+05:30 IST

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) పరిధి మరింత విస్తరించింది.

పెరిగిన తుడా పరిధి

తిరుపతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) పరిధి మరింత విస్తరించింది. తిరుపతి జిల్లా పరిధిలోని 4 మున్సిపాల్టీలను, 14 మండలాలను తుడా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం గురువారం గెజిట్‌ను విడుదలచేసింది. సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి మున్సిపాల్టీలతో పాటు సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, చిల్లకూరు, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో కొంత భాగాన్ని తుడాలో విలీనం చేశారు. పెళ్లకూరు, చిట్టమూరు, కోట, వాకాడు, డక్కిలి, బాలాయపల్లి మండలాలను పూర్తిగా తుడా పరిధిలోకి తీసుకొచ్చారు.   ఈ విస్తరణతో తుడా పరిధి 8మున్సిపాలిటీలు, 41 మండలాలతో 8319.65 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది.  


Updated Date - 2022-09-23T06:46:21+05:30 IST