తగ్గని వైరస్‌ ఉధృతి

ABN , First Publish Date - 2020-07-14T10:22:47+05:30 IST

కరోనా ఉధృతి తగ్గడం లేదు. కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం గ్రేటర్‌లో 926

తగ్గని వైరస్‌ ఉధృతి

 పెరుగుతున్న కరోనా కేసులు


సిటీ న్యూస్‌ నెట్‌వర్క్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరోనా ఉధృతి తగ్గడం లేదు. కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం గ్రేటర్‌లో 926 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

కూకట్‌పల్లి ప్రాంతంలో సోమవారం 29 మందికి కరోనా సోకింది. మూసాపేట సర్కిల్‌ పరిధిలో 24, కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు.  


ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో సోమవారం ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. మొత్తం 82 కరోనా కేసులకు చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. ఆయుర్వేద ఆస్పత్రిలో 61 పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ పరమేశ్వర్‌ నాయక్‌ తెలిపారు. ఆస్పత్రిలో సోమవారం 250 మంది నమూనాలను సేకరించామన్నారు. 


రామంతాపూర్‌, హబ్సిగూడల్లో ఆరుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.  


కాప్రాసర్కిల్‌ పరిధిలో పది మందికి కరోనా సోకింది. చర్లపల్లి అంబేడ్కర్‌ కాలనీలో ఒకరు, ఈసీనగర్‌లో ఒకరు, రైల్‌ విహార్‌ కాలనీలో ఒకరు, మింట్‌ కాలనీలో ఒకరు, బీఎన్‌రెడ్డి కాలనీలో ఒకరు, కుషాయిగూడ ఇందిరానగర్‌లో ఒకరు, మీనాక్షినగర్‌లో ఒకరు, మల్లాపూర్‌ అశోక్‌నగర్‌లో వృద్ధురాలు, నాచారం ఇందిరానగర్‌లో మహిళ, చర్లపల్లిలో ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. 


మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో సోమవారం 15 మందికి కరోనా సోకిందని నోడల్‌ అధికారి డాక్టర్‌ రెడ్డి కుమారి తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో 159 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా వీరిలో 43 మందికి పాజిటివ్‌ వచ్చిందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజు తెలిపారు. ఓల్డ్‌ నేరేడ్‌మెట్‌లో ఒకే 

 కుటుంబంలో ఏడుగురికి కరోనా  సోకింది. రామబ్రహ్మనగర్‌లో దంపతులకు, ఉత్తంనగర్‌లో ఒకరికి, చాణక్యపురిలో ఓ వ్యక్తి, గోపాల్‌నగర్‌లో ఒకరు, ఈస్ట్‌ కాకతీయనగర్‌లో వృద్ధురాలు, సఫిల్‌గూడలో ఒకరు, సంతోషిమా కాలనీలో మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


అల్వాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సోమవారం 46 మందికి ర్యాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించగా వీరిలో పది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


సనత్‌నగర్‌లోని పారిశ్రామికవాడలో 60 మందికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహించగా 11 మందికి  పాజిటివ్‌గా తేలింది. అమీర్‌పేటలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 45 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడురుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు.  


సికింద్రాబాద్‌ చుట్టలబస్తీ యూపీహెచ్‌సీ కేంద్రంలో సోమవారం 36 మందికి ర్యాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది.  


ఓల్డ్‌ బోయిన్‌పల్లి హస్మత్‌పేట అంజయ్యనగర్‌ బస్తీలో ర్యాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షల కేంద్రంలో ఆదివారం 15 మంది, సోమవారం 43 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. 


యూసు్‌ఫగూడ సర్కిల్‌-19 పరిధిలో సోమవారం 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. యూసుఫ్‌గూడ డివిజన్‌లో 17, బోరబండ డివిజన్‌లో 6,  ఎర్రగడ్డ డివిజన్‌లో 8, రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో 3, వెంగళరావునగర్‌లో ఒక కేసు నమోదైంది.  


కుత్బుల్లాపూర్‌లోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం 162 మందికి పరీక్షలు నిర్వహించగా 37 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కుత్బుల్లాపూర్‌ యూపీహెచ్‌సీలో 35 మందిలో 13 మందికి, దుండిగల్‌ ఆరోగ్య కేంద్రంలో 101 మందిలో 17 మందికి, గాజులరామారం యూపీహెచ్‌సీలో 26 మందిలో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 


కొంపల్లి మునిసిపల్‌ కమిషనర్‌, ఓ బిల్‌ కలెక్టర్‌కు కరోనా సోకింది. 


హయత్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో ఒకరు, వనస్థలిపురం సచివాలయనగర్‌లో వృద్ధురాలు, భరత్‌నగర్‌లో ఒకరు, కర్మన్‌ఘాట్‌లో ఇద్దరు, చంపాపేట ఎస్‌జీఆర్‌ కాలనీలో ఒకరు, ఎల్‌బీనగర్‌లో వృద్ధుడు, యువకుడు, ఓ వ్యక్తి, చింతలకుంటలో ఇద్దరు, సరస్వతినగర్‌లో వృద్ధుడు, లింగోజిగూడలో యువకుడు, చైతన్యపురి ప్రభాత్‌నగర్‌లో యువతి, కొత్తపేటలో ముగ్గురు, సరూర్‌నగర్‌లో ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధు లు, ఓ వ్యక్తి, దిల్‌సుఖ్‌నగర్‌ దుర్గానగర్‌లో ఒకరు, కోదండరామ్‌నగర్‌లో వృద్ధురాలు, దిల్‌సుఖ్‌నగర్‌లో వృద్ధుడు, ఓ వ్యక్తి, కొత్తపేట మారుతీనగర్‌లో ఇద్దరు వ్యక్తులు, ఓ యువకుడు కరోనా బారినపడ్డారు. 


బడంగ్‌పేట్‌ పరిధిలోని అల్మా్‌సగూడ మధురాపురి రోడ్‌ నంబర్‌ 2లో ఉంటున్న ఓ వ్యక్తి, బడంగ్‌పేటలో ఒకరు, సంఘీనగర్‌లో వృద్ధుడు, సైదాబాద్‌ భరత్‌నగర్‌లో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.


మలక్‌పేట సర్కిల్‌-6 పరిధిలో సోమవారం 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఓల్డ్‌మలక్‌పేటలో ఇద్దరికి, సైదాబాద్‌లో ఒకరికి, ఉస్మాన్‌పురాలో ఒకరికి, ఆజంపురా ఎంసీహెచ్‌ క్వార్టర్స్‌లో ఉంటున్న వ్యక్తి ఈనెల 8న మృతి చెందగా ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వెల్లడైంది. ముసారాంబాగ్‌ ఇంద్రానగర్‌లో ఒకరికి, శాలివాహననగర్‌ కాలనీలో ఒకరికి, అక్బర్‌బాగ్‌, కరణ్‌బాగ్‌, మలక్‌పేట దయానంద్‌నగర్‌ కాలనీ, గడ్డిఅన్నారం ఎస్‌బీహెచ్‌ కాలనీల్లో ఒక్కొక్కరికి కరోనా సోకింది. 


నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో సోమవారం 349 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. 


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం 362 మంది కరోనా బారినపడ్డారు. మేడ్చల్‌ జిల్లాలో 189 మంది, రంగారెడ్డి జిల్లాలో 170 మంది, వికారాబాద్‌ జిల్లాలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


ముషీరాబాద్‌ యూపీహెచ్‌సీలో ఏడుగురికి, భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీలో నలుగురికి, బాపూజీనగర్‌లో 57 ఏళ్ల వృద్ధుడికి, చేపల మార్కెట్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడికి, రాంనగర్‌కు చెందిన 86 ఏళ్ల వృద్ధుడికి, అదే ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి, 79 ఏళ్ల వృద్ధురాలికి, 67 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.


కంటోన్మెంట్‌లో కొవిడ్‌ పరీక్షా కేంద్రం ప్రారంభం

ఎట్టకేలకు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో కొవిడ్‌ పరీక్షా కేంద్రం ప్రారంభమైంది. తాడ్‌బంద్‌ ప్రభుత్వ పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ పరీక్షల కేంద్రాన్ని కంటోన్మెంట్‌ 6వ వార్డు సభ్యుడు కె. పాండుయాదవ్‌, మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, డాక్టర్‌ అవంతి, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌, కంటోన్మెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ సోమవారం ప్రారంభించారు. తొలి రోజు పరీక్షలు చేయించుకోవడానికి యువకులు అధిక సంఖ్యలో వచ్చారు. 


అత్తాపూర్‌లో పరీక్షల కేంద్రంఏర్పాటు చేయాలి

అత్తాపూర్‌ డివిజన్‌లో కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యువజన కాంగ్రెస్‌ రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నాయకుడు కె. నాగేందర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు వీపీ లలిత్‌తో కలిసి రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ స్వరాజ్య లక్ష్మికి సోమవారం వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2020-07-14T10:22:47+05:30 IST