కొవిడ్‌ పంజా

ABN , First Publish Date - 2022-01-22T06:06:41+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి ఎగబా కింది.

కొవిడ్‌ పంజా
ఏలూరు ఆసుపత్రి వద్ద టెస్టుల కోసం క్యూ


ఒక్కరోజే 596 కేసులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 21 : జిల్లాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి ఎగబా కింది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం 596 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రోజుకు రెండు వేల కరోనా పరీక్షలు మాత్రమే చేస్తుండగా పా జిటివిటీ రేటు 20 శాతంగా నిర్ధారణ అయింది. టెస్టుల సంఖ్య పెంచితే కరోనా వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉంటుందోనన్న భయాందోళనలు సర్వ త్రా వ్యక్తమవుతున్నాయి. సోమవారం నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు(సీసీసీ) పారంభించడానికి క్షేత్ర స్థాయి ఏర్పాట్లను వేగవంతం చేశారు.


నియామకాలకు క్లియరెన్స్‌ నో 

మరో రెండు రోజుల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీసీసీలను ప్రారంభించాల్సి ఉండగా, వాటిలో విధులు నిర్వర్తించేందుకు ఇంతవరకు వైద్య సిబ్బంది నియామకాలు జరగ లేదు. ఆ మేరకు ఒక్కో కేంద్రానికి మూడు షిప్టు ల్లో వైద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఎం ఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు తదితర సాంకేతిక సిబ్బంది నియామకాలకు సంబంధించి ప్రతిపా దనలను ప్రభుత్వానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే పంపినా శుక్రవారం వరకు నిర్ణయం వెలువడలేదు. జిల్లాలో ఓ వైపు పాజిటివ్‌ బాధి తుల సంఖ్య పెరిగిపోతుండగా, కొవిడ్‌ వైద్య సేవలకు కీలకమైన సిబ్బంది నియామకాలు పూర్తికాకపోవడం వైద్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒక్కో కేంద్రంలో 200–300 పడక లతో కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. శుక్ర వారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికం ఏలూరు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. 


15 మంది టీచర్లకు కరోనా 

శుక్రవారం వెల్లడైన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ పాఠశా లల్లో 15 మంది టీచర్లు, ఇద్దరు విద్యా ర్థులకు కరోనా సోకినట్టు తేల్చారు. వీటితో జిల్లాలో సోమవారం నుంచి ఇప్పటి వరకు ఐదు రోజుల వ్యవధిలో మొత్తం 58 మంది టీచర్లు కొవిడ్‌ బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. తాజాగా కరోనా సోకిన టీచర్లలో కొయ్యల గూడెం, మినిమించిలిపాడు, చినమిల్లి, బూపయ్యచెరువు, జిన్నూరు, కొత్తపేట, వద్ది పర్రు, అప్పిచెరువు, రాజులగరువు, తాడి మళ్ళ, వీరవాసరం, పేరుపాలెం, కవి టం, పేరంపేట, దేవులపల్లి సూళ్లకు చెందిన వారు ఉన్నారు.విద్యార్థుల్లో కోమటికుంట, తాడువాయి మెయిన్‌ పాఠశాలలకు చెందిన వారు ఉన్నారు.


టెస్టుల కోసం క్యూ

ఏలూరు క్రైం, జనవరి 21 : జిల్లాలో శుక్రవారం ఒక్కసారిగా కేసులు పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లాలో 55 కొవిడ్‌ ఆసుపత్రులను సిద్ధం చేసి నోడల్‌ అధికారులను నియమించారు. మొదటి, రెండో కొవిడ్‌ కాలంలో పనిచేసిన తాత్కాలిక సిబ్బంది నుంచి మూడో దశలో సేవలందించేందుకు దరఖాస్తులను తీసుకున్నారు. కొవిడ్‌ కేంద్రాలు, ఆసుపత్రులకు అవసరమైన సిబ్బందిని సోమవారం నుంచి డ్యూటీలు వేయడానికి రంగం సిద్ధం చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం అధిక సంఖ్యలో వచ్చారు. అయితే అక్కడ ఐడీలు చేసే సిబ్బంది ఇద్దరు మాత్రమే ఉండడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఎవరికైనా పాజిటివ్‌ ఉంటే మిగిలి వారు పాజిటివ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు సిబ్బందిని పెంచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2022-01-22T06:06:41+05:30 IST