పార్లమెంటు నిరవధిక వాయిదా

ABN , First Publish Date - 2022-08-09T06:33:00+05:30 IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 12వరకు

పార్లమెంటు నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 8: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 12వరకు జరగాల్సిన ఉభయ సభల సమావేశాలు నాలుగు రోజులు ముందుగానే ముగిశాయి. 16 రోజులుగా జరిగిన సభలో ఏడు బిల్లులను ఆమోదించామని, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభలో సోమవారం ప్రకటించారు. రాజ్యసభనూ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ వెంకయ్య ప్రకటించారు. 


స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి

దేశ స్వాతంత్య్ర సమరయోధులకు లోక్‌సభలో నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమం చేపట్టి 80సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల సేవలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రం సాధించడంలో క్విట్‌ ఇండియా ఉద్యమమే కీలక మలుపు అని స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. 

Updated Date - 2022-08-09T06:33:00+05:30 IST